ఎట్టాప్రెగడ పూర్వీకులు కాకరప(ర్తి)ర్రవారా? శ్రీవత్ససగోత్రుడు, సూరనార్యుని పుత్రుడు అయిన ఎటూ పెగడ ప్రోలయవేముని ఆస్థానం అలంకరించిన ప్రథమాంధ్రకవి. 'ప్రబంధ పరమేశ్వరుడు, 'శంభుదాసుడు" ఇతడి బిరుదులు, ఎఱూప్రెగడ పితామహుడు |వేగినాటిలోని (వేంగి) కరావర్తి గ్రామ వృత్తిమంతులలో ఒకడని 'నృశింహ పురాణములో చెప్పబడింది. သဲဖို့ခွါလ် పూర్వీకులు వేగినాడు వాసులుగా దీనినిబట్టి మనకు అర్థమవుతోంది. ... వేగినాటి, గరావర్తి వృత్తిమంతు, డనఘ, డెeఖపోత సూరి కంసారిచరణ కమల మధుకరపతి సార విమల యశుడు పై పద్యంవల్ల, ఎట్టాప్రెగడ పూర్వీకులు కాకరపర్తి గ్రామంనుండి పాకనాటిలోని గుడూరు గ్రామానికి తరలిపోయి అక్కడే స్థిరనివాసం ఏర్పరచు కున్నారని స్పష్టమవుతోంది. నృశింహపురాణంలోని పై పద్యం, కరావర్తి అని పేర్కొనడం తప్ప అనీ, అది "కాకరపర్తి గ్రామం కావచ్చుననీ, అది ఇప్పటికీ అగ్రహారంగానే |నిలచివుందని, 'కరావర్తి లేఖక ప్రమాదమని, అందువల్ల దానిని విడనాడవలెనని శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ చెప్పారు. ఎట్టాప్రెగడకు 5 తరాల పూర్వుడైన భీమనమంత్రి, వెలనాడు దుర్జయ కులాభరణుడైన రెండవ చోడుని(శాశ1084– 1098) వలన అనేక బహుమతులు పొందాడనికూడావారు నిర్ధారించి ఉన్నారు. శ్రీ మల్లంపల్లివారు 'కరావర్తి అని వ్రాయడం లేఖక ప్రమాదమని అన్నప్పటికీ, అది అలా కానవసరంలేదుకూడా. ఆ పద్యఛందస్సుకు సరిపోయే విధంగా "కాకరపర్తిని కవి గరావర్తిగా సంక్షిస్తీకరించి ఉండవచ్చు; లేదా, నాడు 'కాకరపర్తిని 'కరావర్తిగానూ వ్యవహరించి ఉండవచ్చు. ఏదేమైనా, పరిశోధకులు ఈ విషయమై మరింత లోతుగా అధ్యయనంచేసి నిజానిజాలు నిగ్గుతేల్చాల్సివుంది. అయితే, వేంగినాడు అనేది చాలా విశాలమైన భూభాగం. గరావర్తి అనే పేరుకు సరిపోయే మరో గ్రామమేదైనా ఆనాటి వేగినాటిలో ఉందేమోకూడా పరిశీలించాలి. 攀梁梁
పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/32
స్వరూపం