Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తణుకు నివాసిగా తనరినాడనుటకు కొమ్మయ్య చెఱువొక గొప్ప సాక్షి! తనయుడు మనుమడు తణుకువారనుటకు మనుమని తనుకు? శాసనము సాక్షి! నిడుదవోలు రాజరాజేంద్ర నిలయమనుచు ఎన్నో ఆధారములు గల వన్ని చూచి నన్నపార్యండు తణుకు వాడన్న మాట 8. సత్యమిది! భీమనాయక స్వామి సాక్షి! నన్నయ ఊహాచిత్రం | తణుకు ఆర్.టి.సి. బస్టాండుకు నన్నయగారి పేరు పెడితే, అది | నన్నయకు ఇచ్చే కనీసపు నీరాజనం అవుతుందని డా| ఆచార్య తిరుమల | అభిప్రాయపడ్డారు. తాడేపల్లిగూడెంకు చెందిన శ్రీ నెమ్మలూరి సత్యనారాయణ మూర్తి, నన్నయ వర్ధిల్లిన తణుకుకు ఇలా కితాబు ఇచ్చారు: నన్నయభట్టు తెల్ల కవనంబున కాద్యులు వారి సూక్తి తి క్కన్నకు నెట్టనాఖ్యునకు నైనను ధార్మిక మార్గదర్శకం బన్నది నిత్యసత్యమగు; నాతని భారతయజ్ఞభూమిలో నున్న తళుక్కలో మెఅయుచున్నది తణుకన్న చోద్యమే! తణుకు సమీప ఇరగవరం, కాకరపర్రు, మక్కామల, ఖండవల్లి గ్రామాలలో ఇప్పటికీ వైదికాచారనిష్ణులైనటువంటి ఘనాపాఠీలు, యజ్ఞనిర్వహణ దీక్షాదక్షులు ఎందరో ఉన్నారన్న వాస్తవం మనమెరిగినదే. పై చర్చనుబట్టి, నన్నయ స్వస్థలం తణుకు అనీ, కార్యస్థానం రాజ మహేంద్రవరమనీ మనం భావించడం సమంజసం అవుతుంది. * నన్నయ పేరున తణుకులో ධඝාකීටහී స్మారక చిహ్నాలు కానీ, కట్టడాలు |కానీ లేకపోవడం(ఒక్క విగ్రహం మినహా) ఎంతో విచారకరం. గుంటూరులో | తిక్కనగారి పేరున తిక్కన స్మారక గ్రంథాలయం ఏర్పాటుచేసి, ఆయన పట్ల వారికున్న నిబద్ధతతో కూడిన గౌరవాన్నిగుంటూరు వాసులు ప్రకటించుకున్నారు. అలానే నన్నయ పేరున కనీసం ఒక స్మారకగ్రంథాలయం ఉంటే సముచితంగా | ఉంటుందని తణుకువాసుడైన ఈ గ్రంథకర్త అభిప్రాయం. నన్నయ పేరున భాషాభివృద్ధికై ఒక సంస్థనుకూడా ఏర్పరచడం సమంజసం. అలాగే పరమ |పవిత్రమైన గోస్తనీ నదికీ పూర్వవైభవం తీసుకువచ్చి దానిని నిత్యపుష్కరిణిగా చేయడంకూడా కర్తవ్యమే. తణుకువాసులు అందరూ సమష్టిగా ఉద్యమిస్తే, ఇవన్నీ ఆచరణసాధ్యాలే. 裘球球