Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మల్లిన రామచంద్రరావు (జననం:1985)

జూన్ 9న తణుకులో జననం. సుబ్బాయమ్మ వెంకట్రాయుడు తల్లిదండ్రులు. ఉండ్రాజవరం స్వస్థలం. బి.ఎ. చదివారు. మద్రాసులో కాస్ట్ఎక్కౌంటెన్సీ కోర్సులో జాయిన్ అయ్యారు. దానిని అర్థాంతరంగా వదిలి తణుకు తిరిగి వచ్చారు.

వ్యాపారాభిలాషతో ఒక రెటైల్ మెడికల్ షాపులో పార్టనర్ గా చేరారు. 1959లో హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్వీకరించి 1974 వరకు ఆ వ్యాపారంలో ఉన్నారు. 1974 సం||లో కొందరు మిత్రులతో కలిసి 'గౌతమి సాల్వెంట్ ఆయిల్స్ అనే ఇండస్టీని స్థాపించారు. శ్రీ గన్నమని సత్యనారాయణ మూర్తి ఎన్నికల్లో పోటీచేసినప్పడు వారి వ్యవహారాలన్నీ వీరే దగ్గరుండి నడిపారు.| శ్రీ చిటూరి ఇంద్రయ్య మెమోరియల్ సొసైటీకి వీరు కార్యదర్శిగా వ్యవహరించి, శ్రీ చిటూరి ఇంద్రయ్య మెమోరియల్ గవర్నమెంట్ కాలేజి స్థాపనలో కీలకపాత్ర వహించారు. తణుకు ఉమెన్స్ కాలేజి విషయంలోనూ వీరు తన సహాయ |సహకారాలందించి కొంత కాలం డైరెక్టర్గా ఉన్నారు. తణుకు రోటరీ క్లబ్ కు కార్యదర్శి, అధ్యక్షులుగా కూడా పనిచేసారు. వీరభద్రపురంలో, వీరు కార్యదర్శిగా ఉన్నకాలంలో హౌసింగ్ కాలనీ నిర్మించారు. తణుకు హైస్కూల్ పునర్నిర్మాణంలో |ఏర్పడ్డ "వివేకానంద ఎడ్యుకేషనల్ సొసైటీకి వీరే అధ్యక్షులు. సుమారు 1కోటీ 50లక్షల వ్యయంతో నిర్మించబడ్డ ఈ హైస్కూలును గురించి, ఆనాటి| ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు "రాష్ట్రంలోనే පුළු“රéර් వసతులున్న హైస్కూలు మరొకటి ಹಜ” ప్రశంసించారు. తణుకులో ఎంతో ప్రసిద్ధిచెందిన శ్రీరామకృష్ణ సేవాసమితికి వీరు ప్రస్తుత అధ్యక్షులు. సుప్రసిద్ధ 3. నన్నయభట్టారక పీరానికి వీరు అధ్యక్షులుగా ఉన్నారు. తణుకులో 'కాకతీయసంఘం' ఏర్పరచి, దానికి హరిశ్చంద్రప్రసాద్ అధ్యక్షులుగా, వీరు కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సంఘం తరఫున వీరి ఆత్మీయులు శ్రీ భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మల పేరున కమ్మకళ్యాణమండపం నిర్మించారు. ఐదుకోట్లతో నిర్మించబడ్డ ఈ కళ్యాణ మండపానికి 50 లక్షలు విరాళమిచ్చి దానికి చీఫ్ డోనర్గా ఉన్నారు. సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా - సౌత్ జోన్కు చైర్మన్గా, ఎ.పి.రైస్ బ్రాండ్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా సుదీర్ఘకాలమున్నారు. తణుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్టీస్ని వీరే పునరుద్ధరించారు. \— الســــــــــــــــــــــــــــــ ר= తిరిగివచ్చారు. వ్యాపారాభిలాషతో ఒక రిటైల్ మెడికల్|