Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

m - — శ్రీ రాజారావు 1962 నుంచి పూర్తిగా పరిశోధనా రంగానికి అంకిత మయ్యారు. కెమికల్ ఇంజనీరింగ్లో 18 మంది పి.హెచ్డి,లను తయారు |చేసిన ఘనతను దక్కించుకున్నారు. నేడు జాతీయంగా, అంతర్జాతీయంగా ఎందరో విజ్ఞానశాస్త్రవేత్తలు, సాంకేతిక విజ్ఞాన వేత్తలు, ఇంజనీర్లు, అధ్యాపకులు | వీరి శిష్యులుగా పేరుప్రఖ్యాతులు పొందారు. రాజారావుగారు 90కి పైగా |పరిశోధనా పత్రాలను వివిధ విజ్ఞానశాస్త్ర, సాంకేతిక విజ్ఞాన పత్రికల్లో |ప్రచురించారు. యు.జి.సి.లోనూ, వరంగల్ ఆర్.ఇ.సి.లోనూ మద్రాసు, ఢిల్లీ ఐ.ఐ.టి.ల్లోనూ వీరు అధ్యాపన సంఘసభ్యులుగా ఉన్నారు. ప్రతిష్ణాత్మకమైన అంతర్జాతీయ పత్రికలెన్నో వీరి వ్యాసాలను వెలువరించాయి. అధ్యాపనలోనూ, పరిశోధనలోనూ అధ్యాపకుల నిర్వహణనీ, విజయవంతమైన కృషినీ మూల్యాంకనం చేయడానికి రాజారావుగారు ఒక నిర్ణయపద్ధతిని | రూపొందించారు. వీరికి ఉత్తమ అధ్యాపకుడు అవారు, ఉత్తమ పరిశోధనపత్రం | అవారు సైతం లభించాయి. వీరు "నేషనల్ సొసైటీ ఆఫ్ హీట్ & మాస్ | ట్రాన్స్ఫర్ని స్థాపించడంలో విశేషమైన పాత్ర వహించారు. 1983లో బొంబాయి ல.ல.கீ. స్వర్లోత్సవ సందర్భంలోనూ, 2008கு వబ్రోత్సవం సందర్భంలోనూ 89 సంస్థ వీరిని ఘనంగా సత్కరించుకొంది. బొంబాయి ఐ.ఐ.టి.లో వివిధ ప్రక్రియల గురించి, వాటి ఫలితాలను అభివృద్ధిచేసే సామర్థ్యాలను గురించి చర్చించే అవకాశాలను శ్రీ రాజారావు ఎన్నడూ వదులుకోలేదు. అందువల్లనే | కాబోలు బొంబాయి ఐ.ఐ.టి. ప్రస్తావన ఎవరు, ఎప్పడు చేసినా శ్రీ రాజారావుగారిని ప్రస్తావించకుండా ఉండలేరు. డా| రాజారావుగారు మనసుకి ధ్యానం, శరీరానికి యోగాభ్యాసం చాలా అవసరమని చెబుతారు. ఏ వ్యక్తికైనా ఆరోగ్యకరమైన మనస్సు, శరీరం |రెండూ అత్యంత ప్రధానమైనవంటారు. నేటికాలపు సంక్లిష్టమైన జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు తీసుకొనివస్తే, మనిషి శారీరకంగానూ, మానసికంగానూ |ఆరోగ్యంగా ఉండగలడని, అలా అతడి ఆయుషు కూడా పెరుగుతుందన్నది వీరి అభిప్రాయం. తణుకుప్రాంతం భారతజాతికందించిన ఒక విశిష్టవ్యక్తిత్వంగా |ವಿರಿನಿ అభివర్ణించవచ్చు. మేధావులు, విద్యాధికులు శ్రీ రాజారావుగారి వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అంతర్జాతీయస్థాయిలో దేశానికి ఘనకీర్తిని తెచ్చిన | వీరు తణుకుకు గర్వకారణమైన ఒక గొప్ప తళుకు. ഗ്ഗ-—\ mmmm