/2 గణపతిశాస్త్రిగారి అధ్యక్షతన ఈ సమావేశం జరగగా, అంటరానితనం వేద శాస్త్రసమ్మతంకాదని ఈ කරද්රජ්” తీర్మానించారు. తర్వాతకాలంలో, వివిధ కారణాల వల్ల తణుకు జాతీయపాఠశాల మూసివేయబడింది. శ్రీ నారాయణమూర్తి చాగల్లు నియమాలను పాటిస్తూ, చాగల్లు ఆశ్రమాన్ని ఎంతో చక్కగా నడిపారు. 1930వ దశకంలో చాగల్లు ఆశ్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతను తల్లాప్రగడ నరసింహ శర్మ చేపట్టగా నారాయణమూర్తి, ప్రకాశరాయుడుగార్లు మట్లపాలెం తూర్పు తాళ్ళకు వెళ్ళి అక్కడనుండి దిరుసుమర్రుచేరి ఉప్పతయారుచేయుట ఆరంభించారు. వీరికి అండగా జిల్లా నలుమూలల నుండి స్వచ్ఛంద సేవకులు వచ్చిచేరటంతో, ప్రభుత్వం ఆగ్రహానికి గురై వీరిని అరెస్తుచేసి ఆరునెలలు జైలు శిక్ష విధించింది. రాజమండ్రి, బళ్ళారి క్యాంపు జైళ్ళలో వీరు శిక్షను అనుభ వించారు. మూర్తిగారు తన తల్లిని, తమ్ముళ్ళను తణుకు మార్చారు. ඩීට් తమ్ముడికి మతిభ్రమించడంతో ఆయనను చూసే బాధ్యతా పూర్తిగా వీరిపైనే పడింది. కుటుంబపరంగానూ, వ్యక్తిగతంగానూకూడా వీరి జీవితం పూర్తిగా అశాంతితో నడిచింది. అయినా వీరు చెలించిపోలేదు. వీరు "వీరభారతి' కరపత్రాలను ముద్రించి, వాటిని గ్రామాలలోకి తీసుకుపోయేవారు. ఒంటెద్దుబండినిండా ఖద్దరు ಏನ್ರಲಸು తీసుకువెళ్ళి రాత్రివేళల్లో గ్రామాలలో మకాంచేసి, ఖద్దరు ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రచారాన్నీ చేసేవారు. వీరు ప్రకాశరాయుడుగారితో కలిసి స్వదేశీ వస్తువులను గ్రామగ్రామాన విక్రయించేవారు. వీరి స్వదేశీ వస్తువుల ప్రచారమును అణచివేయడానికి ప్రభుత్వాధికారులు అనేక చర్యలు తీసుకున్నారు. మూర్తిగారి గృహాన్ని అధికారులు అనేకసార్లు సోదాచేసారు. మూర్తిగారు దీనితో మరింత ద్విగుణీకృతోత్సాహంతో పనిచేయడం మొదలుపెట్టారు. ప్రతిరోజూ పికెటింగ్ కోసం కొంతమంది వాలంటీర్లను తయారుచేస్తుండేవారు. వీరి వాలంటీర్లు నిత్యం అరెస్తు అవుతూండేవారు. నారాయణమూర్తి ఈ కారణంవల్ల క్రొత్తక్రొత్త వాలంటీర్లను ఎప్పటికప్పుడు సిద్ధంచేస్తుండేవారు. వీరి వారంటీర్ల దళంలో మహిళలుకూడా ఉండేవారు. భీమవరంతాలూకాలో శ్రీ ప్రకాశరాయుడు, తణుకుతాలూకాలో శ్రీ నారాయణమూర్తి వాలంటీర్లను సిద్ధంచేస్తూ, పికెటింగ్ నిమిత్తం పంపుతూ ఉండేవారు. నారాయణమూర్తి తానూ, తన వాలంటీర్లు తణుకులో పికెటింగ్ జరపాలని నిర్ణయించుకొన్నట్లు పోలీస్ అధికారులకు తెలియపరిచారు. పోలీసులు ఆశ్రమం చేరారు. శ్రీ తల్లాప్రగడ ప్రకాశరాయుడు ప్రభృతులతో ఆశ్రమ | لكسسسسسس= - ܥܠ\
పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/198
స్వరూపం