Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

/7 SN తణుకులో మొట్టమొదట జైలుకువెళ్ళింది, రాట్నం తిప్పింది కొవ్వలివారే తణుకుతాలూకాలో జైలుకువెళ్ళిన తొలిజంట కొవ్వలి గోపాలరావు(1896-1958), కనకమ్మ దంపతులు గోపాలరావు తణుకులో అక్టోబరు 19న జన్మించారు. సుబ్బాయమ్మ, fယဂဲလုံ့)ထဲသိယံရွှဗယ తల్లిదండ్రులు. మెట్రిక్యులేషన్ చదివారు. కో-ఆపరేటివ్ సూపర్వైజర్గా ఉద్యోగింప బడ్డారు. మహాత్ముడి పిలుపుతో 1919 స్వాతంత్ర్య సమరరంగంలోకి ప్రవేశించారు. సహాయ నిరాకరణోద్యమంలో ఉత్తేజపూరిత ప్రసంగాలు చేసారు. 1922 సం||లో తణుకు పరిసరగ్రామాలలోని రైతులు ప్రభుత్వానికి భూమిశిస్తు చెల్లించకూడదని నిర్ణయించుకొని, 9 గ్రామాల వారు పన్నుచెల్లింపును నిరాకరించారు. ఆ సందర్భంలో ప్రభుత్వం గోపాలరావు గారిని ఎలాంటి ఉపన్యాసాలు ఇవ్వరాదని, ඩීට් సత్ర్పవర్తనకు హామీగా ధరావతు చెల్లించాలని ఆదేశించింది. వీరు అందుకు నిరాకరించడంతో, ప్రభుత్వం ఏడాది కఠిన కారాగారశిక్షను విధించగా, గోపాలరావు రాజమండ్రి, కడలూరులలో ఆ శిక్షను అనుభవించారు. 1921 సం||లో సహాయనిరాకరణోద్యమ సమయంలో, కొవ్వలివారి గర్జనలతో తణుకు ఉద్విగ్నమయ్యింది. e9&PC3 నరసాపురం సబ్కలెక్టర్గా ఉన్న సింగోడియన్ దొర వీరికి, ఒక సంవత్సరంపాటు ఎటువంటి దేశద్రోహకరమైన ఉపన్యాసాలు ఇవ్వరాదని నోటీస్ జారీచేసింది. గోపాలరావుగారు నోటీసు అందిన సాయంత్రం తణుకు కేశవస్వామి ఆలయం ప్రక్కన ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభలో ఉత్తేజపూరిత ప్రసంగంచేసారు : దేశంకోసమని నా తణుకుతరఫున ఈ రోజున నేను శిక్ష ఆనందంతో స్వీకరిస్తున్నాను. నా శరీరమునేగాని ఈ బ్రిటీషు ప్రభుత్వము నా దేశభక్తిని, నారి ధర్మమును బంధింపలేదు. ఒక్క గోపాలరావు స్థానంలో అడుగునకొక్కొక్క వేయి గోపాలరావులు విజృంభించి భారతమాత దాస్యమును రూపుమాపగలరని నా భవిష్యవాణి. గోపాలరావుగారి భార్య కనకమ్మ చిరుమందహాసంతో నుదుట తిలకం దిద్దగా, పూలమాలను అలంకరించగా, ఆ సందర్భంలో గోపాలరావుగారి తల్లి సుబ్బమ్మగారు పలికిన పలుకులు ఆమె ఎంతటి వీరమాతో చెప్పకనే చెబుతాయి: ألكسسسسسسسسسسس