Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

U ఆంధ్రదేశంలో విశేషజనాదరణ పొందడమే కాకుండా, ప్రజల్లో అద్భుత చైతన్యము, ఉత్తేజమూ కలిగించాయి. అనేకమంది యువకులు ఈ రెండు గ్రంథాలూ చదివి, జాతీయపోరాటంలో వెనుకాముందు చూడకుండా దుమికారనడం అతిశయోక్తికాదు. 1930 సం||లో ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం వీరి 'రఖాన్సీలక్ష్మీబాయి, “ඩීරධි-ධ්‍යත්‍රව්’, "గాంధీనీతిమంజరి' గ్రంధాలు మూడింటినీ నిషేధించి, వాటి ప్రతులను స్వాధీనం చేసుకున్నారట. జగ్గన్నశాస్తి రచించిన వీరసావర్కార్ జీవితచరిత్రలో రాజద్రోహ పూరిత మైన వ్రాతలు ఉన్నాయంటూ భారతశిక్షాస్మృతిలోని 124 సెక్షన్క్రింద ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం వీరిపై రాజద్రోహనేరం ఆరోపించి, కాకినాడ జిలామేజిస్టేట్ ఎదుట కేసుదాఖలు చేసారు. జిల్లామేజి స్టేట్ అయిన బెన్నెట్ ఈ గ్రంథంలో రాజశ్ర హపూరితమైన వ్రాతలు ఉండటం నిజమేనని అంగీకరిస్తూ, గ్రంథ ప్రచురణ జరిగిన 6 సంuల తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం ఈ కేసు పెట్టడం సమంజసంగా లేదన్నారు. శ్రీ శాస్త్రిది నామమాత్రమైన నేరం మాత్రమేనని నిర్ణయిస్తూ, రూ.100/- లు జరిమానా మాత్రం విధించారు. విచారణకు హాజరైన వందలాదిమందిలో ఎవరో ఆ జరిమానా అక్కడికక్కడే చెల్లించారు. ఈ గ్రంధాలపై నిషేధం క్రీ.శ. 1987 సంuలో మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ మేర్పడిన తర్వాత తొలగించబడింది. జగ్గన్నశాస్తి 1930 දීරරnඒ* ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని ఏడాది కఠినశిక్షను ඩීපරක පර්. /}°රයී -ఇర్విన్ ఒప్పందంతో 9 ලිපෙප් విడుదలయ్యారు. 1932 సం||లో నిషేధిత కాంగ్రెస్ సంఘానికి ధనాన్ని సమకూర్చుతున్నారని, కాంగ్రెస్ వాలంటీర్లకు భోజనం తదితర విషయాలు ఏర్పాటు చేస్తున్నారని 《왼 పిస్తూ 7 నెలల శిక్షను విధించారు. 19423 క్విట్ ఇండియా ఉద్యమంలో రాజద్రోహాన్ని ప్రోత్సహించే కరపత్రాలు పంచుతున్నారనే అభియోగంపై యాడాది కఠిన కారాగారశిక్షను విధించారు. శిక్షాకాలం ముగిసిన తర్వాతకూడా వీరు తంజావూరు జైలులో డిటెన్యూగా ఉన్నారు. సుమారు 10 సం||లు తణుకు తాలూకా కాంగ్రెస్ అధ్యక్షుడుగా, 1936-37 లో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా తన సేవలందించారు. 1957 సంuలో వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వాతంత్ర్య సమరయోధుల చరిత్ర రచనకు సభ్యులుగా ఉన్నారు. ఆగస్టు 15, 1972 సం||లో భారతస్వాతంత్ర్య రజతోత్సవాల సందర్భంగా వీరిని ప్రభుత్వం తామ్రాపత్రంతో గౌరవించింది. సామాన్యులకు కూడా r°očaé (රරධීප්පදිංචු | అందేటట్లుచేసి వారిలో జాతీయభావం పెల్లుబికేటట్లు చేసిన ఈ మహానుభావుడు జనవరి 3, 1981న తన తుదిశ్వాస విడిచారు. ※米米 ツ ー