Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ܓܠ\ H చెరుకువాడ వారి ఉపన్యాసం చెరకురసం? 'ఆంధ్రా డెమొస్తనీస్, ఉపన్యాసకేసరి? చెరుకువాడ వెOకట నరసిOహO పOతులు (1887-1964) -- చెరుకువాడవారు కృష్ణాజిల్లా ఘంటసాలలో మార్చి 1వ జన్మించారు. సీతారామయ్య వీరి తండ్రి. దివి హిందూ హైస్కూల్లో మెట్రిక్ చదివారు. లా చదువును లోనే వంగదేశానికి చెందిన ప్రఖ్యాతవక్త బిపిన్ చంద్ర పాల్ ప్రభావం వీరిపై పడటంతో, రాజకీయ, దేశభక్తి ■ _- Cóoé ఉపన్యాసాలు మొదలుపెట్టారు. సంఘసంస్కరణ ඕට්පී ఇష్టమైన విషయమయ్యింది. రఘుపతి వెంకటరత్నం నాయుడు, ವಿತೆ లింగంపంతులు గార్ల శిష్యకోటిలోని వారయ్యారు. కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా కౌతవరంలో నరసింహంగారు ఉపాధ్యాయుడిగా చేరారు. 1910 సం| ప్రాంతంలో ఆ గ్రామంలో "ఆంధ్రలక్ష్మీ జాతీయ విద్యాలయం" స్థాపించి, అనేకమంది స్వాతంత్ర్యసమరయోధులను తీర్చి దిద్దారు. నార్ల వెంకటేశ్వరరావు, మోటూరి సత్యనారాయణ, కానూరి రామచంద్ర చౌదరి, ಬಿ°ಬಾ వెంకటశేషయ్యలాంటి ఉద్దండులైన శిష్యులను ఎందరినో తయారు చేశారు. శిష్యులకు రాజకీయాలు ఎక్కువగా చెబుతుండే వారు. వ్యాయామంకూడా నేర్చేవారు. తాను నమ్మిన పనిని చిత్తశుద్ధితో చేయడంలో వెనుకాడని నైజం పంతులుగారిది. చెరుకువాడవారు 1921లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని 1 సం| కఠిన శిక్షను, 1930లో ఉపు సత్యాగ్రహంలో పాల్గొని రాజమండ్రి, వెలూరు, కడలూరు జైళ్ళలోనూ కఠినశిక్షను అనుభవించారు. తిరిగి 7-1-1932 నుంచి ఒక సం| కఠినశిక్షను రాజమండ్రి, కడలూరు జైళ్ళలో అనుభవించారు. చెరుకువాడ వారు వివిధ జిల్లాలలో పర్యటించి, తన ప్రసంగాలతో ప్రజలను ఉత్తేజపరిచేవారు. నిర్మాణాత్మక కార్యక్రమాలలో అలుపెరగని పోరాటం చేసేవారు. వీరి నోటి వెంట పదాలు నవరసభరితంగా వసూండేవి. వీరు ఉపన్యాసం చెప్పని పల్లెగానీ, పట్టణంగానీ ఆనాటి రోజుల్లో ఆంధ్రదేశంలో ఫీజు కట్టుకోలేక మానేసారు. మెట్రిక్ చదివే సమయం പീ/