行 కాకరపర్తి సత్యనారాయణ SN 19వ శతాబ్ది ఉత్తరార్థం. తణుకు సమీప కాకరపర్రు నివాసస్థలం. 1892 ప్రాంతం(డిసెంబరు)లో తణుకుతాలూకా కాకరపర్రులో 'సరస్వతీ గ్రంధమాల" స్థాపించబడింది. ఈ గ్రంథమాల సంపాదకులుగా సత్యనారాయణ, శ్రీ కె.ఎస్.ఎన్.రామమూర్తులు ఉన్నారు. సరస్వతీగ్రంథమాల సంపాదకులుగా ఉంటూనే వీరు ఎన్నో గ్రంథాలు వెలువరించారు. 1923లో "కనకాంగి, 19245 "పిష్వా నారాయణరావు వధ' నవలలను సంఘసంస్కరణధ్యేయంతో వ్రాసారు. దేశభక్తి, గతవైభవ స్మరణ వీరి నవలలలో ప్రధానాంశాలు. 1771 ప్రాంతాలకు చెందిన మహారాష్ట్ర రాజవంశానికి చెందిన కథ వీరి పీష్వా నారాయణరావు వధ. ఈ విషాదాంత రచన 13 విభాగాలుగా ఉంది. ఔచిత్యానికి අරට(රට వాటిల్లకుండా පුටකජි” కొన్నికల్పనలు చేసారు. ఒథెల్లోను అనుసరించి ఉండే కరుణరసప్రధాననవల వీరి "కనకాంగి. ఇది పాఠశాల విద్యార్థులకు పఠనీయగ్రంథంగా నిర్ణయించబడింది. వీరు సరళగ్రాంథిక రచనాశైలితో సమ కాలిక సాంఘికాచారమర్యాదల పరిశీలన, దురాచార ఖండన వీరి రచనలలో ప్రధానంగా చూపారని విమర్శకులు ప్రశంసించారు. వీరి సంపాదకత్వంలోని 'సరస్వతీ గ్రంధమాల"కు జటప్రోలు, నూజివీడు, కొల్లాపురం ఎస్టేటు జమీందారులు మహారాజపోషకులు. 35 సం||ల పాటు నిర్విఘ్నంగా కొనసాగిన ఈ సంస్థ 50 పుస్తకాలకుపైగా ప్రచురించింది. 1982లో జవ్వాదివారి ఆధ్వర్యంలో నడిచే "పెనుగొండ కూడా దీనిలో కలిసింది. ఈ గ్రంథమాల 1958 ప్రాంతాలలో అద్దేపల్లివారి 'సరస్వతీగ్రంథమండలిలో కలిసిపోయింది. గద్దె రామలింగకవి ఇతడు తణుకు తాలూకా సిద్దాంతంగ్రామంవాడు. "చోడలింగశతకము" వ్రాశాడు. ఇతడు తన శతకంలో సిద్దాంతం గ్రామంలోని సీతలింగేశ్వరుని, గోస్తనీనదిని ఎంతో ప్రశంసించాడు. ఇలా ఎందరో మరెందరో ఉద్దండులైన కవి పండిత దానవీరులు తణుకు తాలూకా నివాసులై ఎంతో సారస్వత, సామాజిక సేవచేసి తమ జీవితాలను చరితార్థం చేసుకున్నారు, శాశ్వత యశస్సును ఆర్థించుకున్నారు. ఈ సీమను రసప్లావితంచేసి, సాహిత్యసస్యాన్ని పండించి భావితరాలకు ఉత్తమ వారసత్వంగా అందించారు. దీనిని గుర్తించి, గ్రహించి జీవించడం ఈ ప్రాంత వాసుల కర్తవ్యం. * * * ク m ܓܠܠ
పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/165
స్వరూపం