డా వడూరియేడుకొండ వేంకటేశ్వర సోమయాజి (1947-2007) ప.గో.జిల్లా కన్నాపురంలో, 3-10-1947న జననం. సీతామహాలక్ష్మి అచ్యుతరామకవి తల్లిదండ్రులు. సోమయాజి భాషాప్రవీణ, ఎం.ఎ.లు చేసారు. తణుకు జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో గ్రేడ్-1 తెలుగు పండిట్గా ས། సుదీర్ఘకాలం ఉన్నారు. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి ఉత్తమ పాధ్యాయ అవారులందుకున్నారు. పాఠ్యాంశాలను నాటకీకరణద్వారా విద్యారులకు ఆకర్షణీయంగా బోధించేవారు. విద్యారులతో సాహిత్యరూపకాలు, బాలకవి సమ్మేళనాలు, అష్టావధానాలు చేయిసూ స్వభాషపై అభిరుచిని కలిగించేవారు. విద్యార్ధులలో రచనాస(శక్తిని పెంపొందించడానికి 'బాలభారతి' అనే లిఖిత పత్రికను తయారుచేయించేవారు. నూతనవిద్యావిధానంపై శిక్షణపొంది, 1987లో 40 రోజులు రిసోర్స్ పర్సన్గా వ్యవహరించారు. సోమయాజి 1981లో 'కొల్లేటిపాటలు - ఒక పరిశీలనము' పై ఎం.ఫిల్ ను, 1990లో తెనాలిరామలింగకవి కథలు - సవిమర్శక పరిశీలనము పై పి.హెచ్డి.లు పొందారు. 2000లో పాలకొల్లులో జూనియర్ లెక్చరర్, తణుకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజిలో పదవీ విరమణచేసారు. 1991 మార్చి 24–26 లలో విజయవాడలో జరిగిన దక్షిణప్రాంత జానపదకళల సదస్సులో పాల్గొని, 'కోస్తా ఆంధ్రలోని జానపద మరియు గిరిజన కళారూపాల సేకరణ, పరిరక్షణ' అనే పరిశోధనాపత్రాన్ని సమర్పించారు. 1984లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన యు.జి.సి. ఫోకెలోర్లో నెల రోజులు పాల్గొన్నారు. డా|| బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంవారిచే ఒకసారి 3 సం||ల డిగ్రీ ఎకడమిక్ కౌన్సిలర్గా నియమించబడ్డారు. శ్రీ సోమయాజి ఆకాశవాణి విజయవాడకేంద్రంలో పురాణప్రవచనాలు, ప్రసంగాలు, రూపకాలు, సూక్తిసుధలు 20 సం||లపాటు నిర్విఘ్నంగా కొనసా గించారు. ఆకాశవాణి, న్యూఢిల్లీవారిచే రెండు పర్యాయాలు ඒ*ජඒ ප්රයීත්වටි కమిటీ సభ్యులుగా నియమించబడ్డారు. "కుహేళిక', 'ఆంద్రోదాహరణము, "హనుమత్సుప్రభాతమ్ (సంస్కృతం), 'ఆశంసలు— ఆకాంక్షలులు వీరి రచనలు. ఎందరి ఆదరాభిమానాలో చూరగొన్న ఈ సారస్వత ధురీణుడు జనవరి 23న, 2007 సం||లో తన తుది శ్వాసను విడిచారు. K. : : الدس - ܓܠ\ /? N
పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/126
స్వరూపం