Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

/2 N "సాహితీ తపస్వి వి.ఎస్.వి. ప్రసాద్ (జననం-1947) వెలిచర్ల సత్యనారాయణ వర ప్రసాద్ 1947, ఆగస్టు 10న జన్మించారు. దేవరపల్లి మండలంలోని యాదవోలు స్వస్థలం. లక్ష్మీనరసమాంబ, శంకరయ్యలు వీరి తల్లిదండ్రులు. 2005 సం||లో తణుకు జిల్లా పరిషత్ ". ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉద్యోగ విరమణ చేశారు. జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులందుకున్నారు. సాహిత్య వ్యాసంగం, వక్తృత్వంలు వీరి ప్రవృత్తులు. జనాభా గణనకు రాష్ట్రపతి ప్రశంసాపత్రం పొందారు. ప్రసాద్ 1972 నుంచే సామాజిక, రాజకీయ సమస్యలను ప్రతిబింబించే వచన కవిత్వాలను అందించారు. వీరు వ్రాసిన అనేక కవితలు రాష్ట్ర జాతీయ, ప్రశంసలందుకోవడమే కాకుండా, యూనిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రశంసలనూ అందుకున్నాయి. వీరికి అనేక సంస్థలు అవారుల నిచ్చి గౌరవించాయి. వివిధ సాహిత్య సంస్థల ద్వారా 100 ఉత్తమ ప్రోత్సాహక అవార్డులు, 150 ఇతర అవారులూ పొందారు. వీరి 'విషమే విషం' కవితకు అంతర్జాతీయ బహుమతి లభించింది. ఈ కవితను I.P.F.M. ఐక్యరాజ్యసమితి జర్నల్లో ప్రచురించారు. 'భావదీపికలు', 'అగ్ని క్షిపణి', 'అమృత సరస్సు, భక్తి మార్గం' లాంటి గ్రంధాలను ప్రసాద్ రచించారు. ప్రసాద్ కొండగూడెం దుర్గమ్మ చరిత్ర’ ను రచించి, తన పుస్తకం ద్వారా ఆ పుణ్యక్షేత్రాన్ని వెలుగులోకి తెచ్చారు. 300పైగా వచన గేయాలు రెండు సంపుటాల్లో రచించారు. 250కు పైగా కవి సమ్మేళనాలలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వివిధ సంస్థలు వీరిని "ఆంధ్రరత్నం', "సాహిత్యరత్న, సాహిత్య సార్వభౌమ', సాహితీ తపస్వి, 'కవిమిత్ర" బిరుదులతో గౌరవించాయి. వి.ఎస్.వి.ప్రసాద్ నిస్సందేహంగా ప్రతిభావంతులైన కవి, రచయిత, ఉపన్యాసకులూనూ, స్థానిక గ్రంథాలయంలో రీడర్స్ ఫోరం నిర్వహించే కార్యక్రమాలలో వీరు చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. మంచి విషయ పరిజ్ఞానంతో వీరు సుదీర్ణ ప్రసంగాలు చేస్తూంటారు. ప్రసాద్ గారిని రీడర్స్ ఫోరంలోని కొందరు సభ్యులు AK-47" అని ప్రేమతో పిలుచుకుంటారు. కవిగా రాష్ట్రస్థాయిలో అవార్డులు పొందడం వీరికి పరిపాటి. నిరంతర సాహితీ తపని ప్రసాద్గారికి 4éíбараа9àбоё5йбер. 裘浆浆