Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

/ー -────།༽ అబద్దానికి మధ్య, 'మాతృబంధం, "సజలనేత్రి', 'కనిపించేగతం', "రాగవల్లకి’, 'పంజరంకోరిన మనిషిలు వీరి నవలలు. "మన శల్యాలు ఈమె కవితాసంకలనం. ఈమె వ్రాసిన 'కనిపించే గతం' నవల పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం | నుంచి ఉత్తమ రచయిత్రి రచనా పురస్కారాన్ని అందుకుంది. ఈమె అమెరికాలోని వంగూరి ఫౌండేషన్ 2002లో ప్రచురించిన అమెరికా తెలుగుకథకు కోఎడిటర్గా బాధ్యతల నిర్వహణ చేసారు. ప్రఖ్యాత బి.రజనీకాంతరావుగారి సావనీర్ ఎడిటింగ్ చేసారు. నటి పి. భానుమతి, దుర్గాబాయ్లపై పుస్తకాలను ప్రచురించారు. 'లలితగీతమాలిక', 'శివాక్షరమాల'లను తానేపాడి రెండు | |క్యాసెట్లను విడుదలచేసారు. ఈ టి.వి.2లో "పాటలపాలవెల్లి ప్రోగ్రామ్ | |నిర్వహించారు. రేడియో స్పందనలో 'పదలహరి' అనే ప్రోగ్రామ్ సమకూర్చి 50 ఏళ్ళ తెలుగు సినిమాలపై సంగీతకార్యక్రమం నిర్వహించారు. వీరి కథలకు 'రంగా-జ్యోతి' అవారు, జ్యోత్నాపీఠంవారి అవార్డులను అందుకున్నారు. ఆమె గురించి ఆమె మాటల్లో... t నేను పట్టింది రాజమండ్రిలోనైనా, నాకు ఊహతెలియడం మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు'అనే ఊళ్ళనే, ఆ ఊరిని పల్లె అనాలా, పట్టణం అంటే|| బావుంటుందా అనేది తేల్చడం కష్టం. ఆ జిల్లాలో అది కాస్త ప్రగతిగల ఊరే, ఎందుకంటే అక్కడ ఆడపిల్లలు చదువుకునే పాఠశాల ప్రత్యేకం ఉంది. దాని పేరు సీతామహాలక్ష్మి జిల్లా పరిషత్ గరల్స్ హైస్కూల్, నేను అక్కడే ఫస్ట్ఫారమ్ నుంచీ చదువుకున్నా అదీకాక మా అమ్మగారు అదే స్కూలులో సంగీతం టీచర్గా పనిచేస్తూండేవారు. నాకు చిన్నప్పటినుండి సంగీతమంటే ప్రాణంగా ఉండేది. ఇంట్లో సంగీత వాతావరణమే ఎక్కువగా ఉండేది. కీర్తిశేషులు దేవరకొండ బాలగంగాధర్ తిలక్గారు మా ఊరివారేనని ప్రత్యేకం చెప్పవలసిన పనిలేదనుకుంటాను. తణుకుపేరు చెప్పగానే ముందుగా చెప్పవలసిన పేరు ఆయనది. ఆయన కవిగా, కథారచయితగా, నాటకరచయితగా ప్రసిద్ధిపొందినవారు. ఆయన ఎంతగొప్పకవో, అంతగొప్ప సంగీతాభిమానులు. ఆయనకి ఎంతో సన్నిహితంగా, శిష్యురాలిగా మసలిన ఆ రోజులు గుర్తుకొస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. 1964–65 || ప్రాంతాల్లో సాహితీమిత్రుల మందరం ఆయనచుటూచేరి వారుచెప్పే అద్భుతమైన విషయాలు వింటూ మా కథలూ, కవితలూ వినిపిస్తూ ఎంతో అనిర్వచనీయమైన ఆనందం పొందేవాళ్ళం. ఆయనకి మాలాంటి కుర్రకారుమీద ఎంతో అభిమానం ఉండేది. మేము కలిసిన వెంటనే | నా పాటతోనే కార్యక్రమం మొదలయ్యేది. ఆయన మాకు తెలుగుసాహిత్యం గురించి మాత్రమే కాకుండా ఇంగ్లీషులో వచ్చిన గొప్పగొప్ప పుస్తకాలగురించి, ప్రపంచ సాహిత్యం గురించీ చెప్పేవారు. చెకోవ్, టాల్స్థాయ్, మార్క్ట్విన్, ఓహెన్రీ లాంటి మహారచయితల | రచనా పరిచయం తిలక్గారి మాటలద్వారానే కలిగింది. 浆染浆 المــــــــــ - ܠ\