*3:ýrasš3)" čôJočš9 ÖOOoOoč9) (as:5šo: 1936) - కృష్ణాజిల్లా కైకలూరులో 28-7-1936న జననం. పద్దాల వెంకమ్మ జానకిరామయ్యలు తల్లిదండ్రులు. పోలీసుఉన్నతాధికారిగా పనిచేసిన వీరి తండ్రి గారు অনুগ্রহ কেৰ సంగీత, సాహిత్య, ఆయుర్వేద వైద్యాలలోనూ మేటి. * రంగారావుగారు ఉభయభాషా ప్రవీణులై, ఆంధ్రా యూనివర్సిటీలో గోల్డ్మెడలిస్ట్గా నిలిచారు. కావ్య శ్రీ నాటక, అలంకార, జ్యోతిష, తర్క వ్యాకరణాది লগতেge) లోనూ ప్రావీణ్యత సాధించారు. తిరుమల గుదిమల్ల వరదాచార్యులు, మల్లంపల్లి వీరేశ్వరశర్మ శరభయ్యలు వీరి గురువులు. నటుడుకూడా అయిన రంగారావు | | గారు 'అభిజ్ఞాన శాకుంతలములోని శాకుంతలపాత్ర ధరించిన సందర్భంలో, ఆనాటి ప.గో.జిల్లా బోర్డు అధ్యక్షులు సుంకర వెంకటరామయ్య తిలకించారట. వారు రంగారావు గారిని తణుకులో ఉపాధ్యాయుడుగా నియమించారు. | 1953-95 సం||ల మధ్య తణుకు బాలికోన్నత పాఠశాలలో 15 సం||లు, ఆ తర్వాత తణుకు బాలురోన్నత బహుళార్ధకసాధక పాఠశాలలో సంస్కృతాంద్రోప న్యాసకులుగానూ పనిచేసారు. 1958-59లో తణుకు బాలురఉన్నతపాఠశా| లలో పనిచేస్తున్నప్పుడు 'వర విక్రయము నాటకంలో భ్రమరాంబపాత్రను పోషించి |ప్రజామన్నన పొందారు. తణుకు "మారుతిటాకీస్లో టిక్కెట్టునాటకాలు ఆడి, ఆ ధనంతో బాలురపాఠశాలలో కళామందిర నిర్మాణం చేసారు. రిసోర్సుపెర్సన్గా |తెలుగుబోధనా పద్దతులను విపులీకరించారు. స్కౌటు ఉపాధ్యాయుడుగా వీరు |ఢిల్లీలో ఆనాటి ప్రధాని మురార్జీదేశాయ్ చేతుల మీదుగా ప్రథమ బహుమతిని | |పొందారు. "హోమ్గార్డ్ ప్లేటోన్ కమాండర్గానూ బాధ్యతలు నిర్వహించారు. తణుకు శ్రీ నన్నయభట్టారకపీఠం, నరేంద్రనాథ సాహిత్యమండలిలలో | |చురుకుగా పాల్గొన్నారు. ఆనాటి రోజుల్లో తణుకులో రంగారావుపాల్గొనని సభ| එස්ටර්හී అతిశయోక్తిలేదంటారు. దూడల రంగారావు మాట పసిడిమూట? అని పేరుగడించారు. 'సహజకవి', 'మధురకవి', 'అవధానశేఖర బిరుదులతో గౌర వించబడ్డారు. "హంపీచరిత్ర', 'చంద్రగిరిదుర్గం', 'యవనశ్రీలు వీరి ముద్రిత | రచనలు. రంగారావు సంస్కృతంలో వ్రాసిన 'శ్రీపర్వతమహిమ, దేవీస్తవము, "భద్రగిరి కళ్యాణములు అముద్రితాలు. అవధానాలలోనూ, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇవ్వడంలోనూ వీరిది అందెవేసిన చెయ్యి
పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/104
స్వరూపం