పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
74

[అం 2

త గి న శా స్తి

కనీసము చేసినారు మనమాట, గౌరవము రవ్వంతైనా లేదు. ఇదే మనము చేస్తే మహాపరాధమని పెద్దగోల చేస్తారు.

 పూర్ణే--వీళ్ళు సోలెడుబియ్య ముడికించి మన నెదాన పోయరు. ఇక నటుకులు తిని కాలక్షేపము చేయవ్చలసినదే!  
 సూర్య--అంతటితో తీరిపోదు; భగవంతు డిచ్చిన చెవులు రెండూ ఉంచరు.
 ఉమా--కిందటి శనివారము నే నింటికి రావడముకొంత మాలస్య మయింది; తొమ్మిదైనారాలేదు. ఆపాళంగా వంట column blank అమ్మగారు మంచముమీద ఒక టంకె వేసినారు.
 పూర్ణే--మీపని నయమే, నాసంగతి వినండి, ఆనాడు మాదేవిగారు తులుపుతీయలేదు, వీధిఅరుగుమీద రాత్రంతా కాలక్షేపము చేయవలసివచ్చింది.
 రామ--ఏపొరూ లేకుండా పండుకున్నావు. అదీ కొంత నయమే. మాఆవిడ నేను రావడము చూసి, 'గొంగ దొంగ" అని కేకవేసి కుక్క నుసిగొల్పితే పరుగెత్తిపోయి పరాయిచోట చెట్టుక్రింద పండుకొన్నాను.
 ఉమా--(సూర్యతో) నీకు జరిగిన మర్యాద ఏలాంటిది?
 సూర్య--చెప్పుకొంటే ఏమిప్రయోజనము? నాకధ వింటే నక్కలూ కుక్కలూ ఏడుస్తాయి.