పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
70

[అం 2

త గి న శా స్తి

 సువే--ఏందుకూ వెలి?
 ఉమా--అతనిబార్య వితంతు వట తగినన్ని నిదర్శనాలు చూపించి పెద్దలంతా వాళ్ళని వెలి వేసారు కదా వారింటికి మనము వెళ్ళవచ్చునా?
 సువే--అన్నీ అబద్దాలు, వైదిక బ్రాహ్మణులకు లంచాలు (సంభావనలు) సరిగా ఇవ్వలేదని వాళ్ళీపుకారు పుట్టించారు. కాని ఇందు సత్యమేమీ లేదు.  వారింటి కందరూ వచ్చిపొతూన్నారు; వెలీ లేదు గిలీ లేదు.
 ఉమా--ఏమో, వారింటికి వళ్ళడము నాకు సమ్మతము కాదు.
 సువే--అలాగైతే మీదు రాకండి పెద్దమనిషి పేరంటానికి రమ్మంటే పిరికివాళ్ళ మాటలు విని నేను వెళ్ళకపోవడమెమి పెద్దమనిషి తరహా? నేను వెళ్ళడము మానను.

(సుకేశినీ రామచంద్రులు వ్చత్తురు)

 సుకే--చూచినావా, సువేషిణి?
 రామ--ఉమాకాంతమూ, చూడుచూడు.
 ఉమా--ఏమి టేమిటి?
 సుఏ--ఏమిటి కధ?
 రామ--రామారావుగరింటికి వెళ్ళవద్దని నా పట్టు
 సుకే--నే నాయనమాట వినకతప్పదా?
 రామ--నామాట వినిపించుకోవలెనా? వద్దా?