పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 6]

69

త గి న శా స్తి

అసలే నేను బడాయికోరునని ప్రతీతి, దానికితొడు నేను బండి లేకపోతే నాకు పీకపోయినట్లుంటుంది.

 ఉమా--పోనీ, నడెచే వస్తాను, పిల్లల మాటో?
 సువే--దాసీ దాడిస్తూంటుంది. ఆక లయితే పాలు పోస్తుంది. ఇంతలో మీరు వస్తారుగా? అన్నము తినిపించండి.
 ఉమా--అంతదాకా వా ళ్ళేడుస్తూండవలసిందే? చంటీల్లని కూడ వదలి చక్కబోతావా నీవు?
 సువే--ఒక్క గంటేగా? మీరేడుగంటలకి రానే వస్తారు. అలమరలో పాలున్నవి, Stove ఉన్నది. కాస్త వెచ్చబెట్టి పాలుపోస్తే ఆకలి తీరుతుంది, లేదా Horlicks పోయండి.
 ఉమా--పిల్లలెమైన సరే, మగ డేమైనా సరే నీకు Engagement తప్పదా?
 సువే--మే మేమయినా మీరు కచేరికి వెళ్ళడము మానినారా? పగలంతా నాపాట్లు నేను పడ్డాను కాని మీ రేమైనా తోడు పడ్దారా? ఈఊరి కాఊ రెంతో ఆఊరికీఊ రంత.
 ఉమా--నాకచేరీకీ నీ tea party కిన్నీ సాటితెచ్చి నావా?
 సువే--రెండూ అవసరమైన పనులే
 ఉమా--సరేకాని రామారావుగారికి వెలి కదా వారింట నీవు విందారగించబోతావా?