పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
68

[అం 2

త గి న శా స్తి

 ఉమా--ఏమి టా రాచకార్యము?
 సువే--రాచకార్యాలు మీకే కాని మాకెక్కడివి? రామారావుగరింట చిన్న Entertainment ఉంది. ఐదు గంటలకి మొదలు, ఎనిమిది కావచ్చును పూర్తి అయ్యేటప్పటికి.
 ఉమా--పిల్లలమాట?
 సువే--మీరుంటారు.
 ఉమా--నాకు తెరపి లెకుంటేనే తలమ్ముకొన్న నాకు స్వేచ్చ ఎక్కడిది? ఈ వేళ treasury account పోవాలి--urgent. నే నుండక వల్లకాదు.ఏమి దారి?
 సువే--సేలవుచీటీ వ్రాయండి.
 ఉమా--అమ్మయ్యో! సెలవిస్తారా! డెప్యూటీ కలక్టరు అమాంతముగా గొంతుక కొరుకుతాడు.
 సువే--జబ్బని వ్రాయండి. తలనొప్పో, జ్వరమో, వాంతులో అని వ్రాస్తే సెలవిచ్చి తీరాలి, చచ్చితీరాలి.
 ఉమా--చచ్చేటందు కొకరి సెల వక్కరలేదు. ఇప్పటిదాకా గట్టిగా నున్నానని ఎరుగును. ఇప్పుడే కచెరీనుంచి వచ్చినానుకదా, జ్వరమంటే నమ్ముతారా?
 సువే--నాకెందుకాఘోష. బండీ కావలె. నాకోసము మరికొందరు కాచుకొని ఉంటారు, వాళ్ళతో బండీమీద వస్తానని చెప్పినాను, వెళ్ళకుంటే వేళాకోళము చేస్తారు.