పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 6]

67

త గి న శా స్తి

మీరు సవారీ చేస్తున్నారు. మా సుఖమంతా మీ నెదాన పెట్టి మీ కష్టము మే మనుఃభవిస్తున్నాము, మీరు హాయిగా సుఖపడుతూన్నారు. కావలసినంత స్వేచ్చ, కాదనేవాళ్ళు లేరు. మే మేమేనా అంటే మమ్ము చావచంపుతారు దేహబలమొకటి ప్రసాదించినాడుగా పాడు దైవము, మామీద దానిని వినియోగిస్తూన్నారు. ఇంకెన్నాళ్ళో సాగవు లెండి మీఆటలు. మావాళ్ళంతా కన్నుతెరచే సరిగి మీభోగము బొగ్గుల పాలవుతుంది. మీ అధిక్యమడు కంటుతుంది.

 పూర్ణే--(తనలో) శృతి మించుతూన్నది, ఇక నీ ప్రస్తావన ఆపడమే శ్రేయము...(పోవును)
 మహా--శృంగభంగ మయింది. మొగము వాచినట్లు పెట్టినాను చీవాట్లు...(పోవును)

{{Center|---}

---?ఆ రో రం గ ము?---

---

ఉమాకాంత మిల్లు--భార్యాభర్తలు,

 ఉమా--నేడు బండీ ముందుగా పంపడానికి వీలుండదు, పని తొందరగా ఉంది, అది ముగిసేసరికి చీకటి పడుతుంది. కాలినడకను అప్పుడు వావలెనంటే కష్టముగానుంటుంది.
 సువే--ఈరోజు నాకు బండీ తప్పకుండా కావాలి, నేను వచ్చేటప్పటికూడా చీకటి పడుతుంది.