పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
66

[అం 2

త గి న శా స్తి

మానుకొన్నది. ఎన్నడో వ్రాసిన శృతులు, స్మృతులూ ప్రమాణములుగా నున్నవి. తరువాత వారెవ్వరూ వాటిని సంస్కరించలేదు, రానురాను అవి శిలారూపము దాల్చినవి. ఇప్పు డేదైనా సంస్కరింప మొదలుపెట్టితే మీరందరూ గోలుమని రవ్వపెట్టి, మార్పుమాకొద్దు, మాఋషులు శాశ్వతములయిన విధు లేర్పరచినారు. అని మాకు సర్వశ్రేయోదాయకములుఇ, వాటిని మార్చ నవసరము లేదని మొర్ర పెట్టుతారు. అందుచేత కనుబొమ్మ మీది వెడృకల వలె అదుగూబొదుగూ లేక మనసంఘము ఒక్కరీతినె ఉన్నది... ఇప్పుడిప్పుడు ఉత్తరహిందూస్దాన మందలివారు కొంతమార్పు చేసుకొన్నారు. కనుక బాగుపడ్డారు. దాక్షిణాత్యులు మాత్రము మంచీచెడ్డా ఆలోచించక పూర్వాచారములు పట్టుకొనే వేలాడుతున్నారు. మాఉసురు తగిలి ఈ యాచారములు మట్టిలోఫ్ ఎప్పుడు కలుస్తవో అప్పుడు మన సంఘానికి మంచిదినములు వస్తవి. కూతురు పుఇట్టగానే గోలుమను ఏడ్పు పోతుంది.

 పూర్ణే--బాగుంది, మీరంతా సంఘసంస్కర్త్యలు కాబోతారు కాబోలు! చెయ్యండి కొత్తతీర్పులూ! తగినమార్పులున్నూ
 మహా--ఏదీ చేతకాక మీరు చేతులు నులుపుకొని కూర్చుంటే మేము నడుముకట్టక తీరుతుందా? మీకేమి పోయింది? హాయిగా అధికారము చలాయిస్తూన్నారు. మా