పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 5]

65

త గి న శా స్తి

చక్కబెట్టుకొంటా మనే ఆడవాళ్ళు ఉదయిస్తే ఇందు వైపరీత్య మేమీ లేదు. ఏదో కారణముచేత యిష్టములేని భార్యను విడిచిపెట్టడము మగవాళ్లలో లేదా? అది వైపరీత్యము కాదా? ఆడది తన మగని విదిచినంతమాత్రాన వైపరీత్యమవుతుందా? ఒక భార్యమీద ఏదో నేరముమోపి రెండో దానిని ఛేసుకోవడము మనము చూడలేదా? అలాగు స్త్రీ లేల చెయ్యకూడదు? మీరు మేమూ భగవంతుని దృష్టికి సమానులమేకదా? సరిసమానులలో తారతమ్యము ఔట్టడానికి హేతువేమి?

 పూర్ణే--మీవాదము చూస్తే సనాతనధర్మ మంతా తారుమారు చేసేటట్లున్నదే! సంఘ విప్లవముసంభవించే టట్టుంది.
 మహా--విప్లవమనకండి సంస్కరణ మనండి, లోపములు సవరించుకొవడము సహజధర్మమవునాకాదా? స్త్రీ పురుషుల కింత వ్యత్యాసముండడమువల్ల స్త్రెలకు చాలా నష్టముగా నుంది, కావున సంస్కరణ మత్యావశ్యకము. ఇతరదేశముల దిక్కు కన్ను తెరచి చూడండి--అమెరికా, ఫ్రాన్సు, ఇంగ్లండు, చీనా, జపాను దేశములలోని స్త్రీలింత అధోగతిని పడలేదు. వారందరూ కాలానుగుణముగా ఆచారవ్యవహారములు మార్చుకొన్నారు. అందుచేతనే ఆదేశములన్నివిషయములా అభివృద్దిని చెందినవి. భరతఖండము మాత్రము పూర్వాచారమే పరమధర్మమని సంస్కరణమును