పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
64

[అం 2

త గి న శా స్తి

ధారగా పెళ్ళైదురోజులూ ఏడ్చింది; చూచినవారంతా మీనోట్లో గడ్డి పెట్టినారు, ఎంతమంది చెప్పినా మీరు విన్నారా? మీమాటే నిల్పుకొన్నారు కాని అప్పుడు నోరూవాయీ లేనిపసిపిల్ల, అభమూ శుభమూ ఎరుగనిదికనుక ఊరకుంది. ఇప్పుడు కొంచెము జ్ఞానము వచ్చింది, మంచీ చెడ్డా తెలిసినవి, మూగపశువులాగు ప్రతివిషయమునా మీ మాటచొప్పున నడవడము దానికి నచ్చలేదు. అందుచేత ఆమొగుడు మొగాన మొద్దులు పెట్టింది, శని వదల్చుకొన్నది, హాయిగా యిక్కడ ఉండి కాలక్షేపము చేస్తుంది. అందు తప్పేమి?

 పూర్ణే--తప్పులేదంటావా? ఈడువచ్చినపిల్ల పుట్టింటెన్ని నాళ్ళుంటుంది? ఇది మర్యాదేనా? ఎక్కడేనా ఉందా ఈ వైపరీత్యము?
 సుహా--మగవాళ్ళేమి చేసినా మారుమాటాడక గాడిదెలా గన్నింటినీ సహించి  మీరే దిక్కని జోహారు సల్పే ఆడవాళ్ళున్నంత కాల మిది వైపరీత్యమే-మాకూ బుద్ది ఉన్నది, కష్టమూ సుఖమూ మేమూ అనుభవిస్తూన్నాము. ఓర్వగలిగినంతకాల మోపిక పట్టినాము. ఇటుపైని మాకు సంబంధించే విషయములలో మా ససలహీలెనిదే మీరు వ్యవహరించడముకు వీలులేదు. మమ్మడిగి మాసలహా తీసుకొని మాయిష్టము, లాబనష్టములూ, సుఖదు:ఖములూ విచారించి వ్యవహరిస్తే మీమాటచొప్పున యధావిధిగా నడుస్తాము, లేదా స్వతంత్రించి మా వ్యవహారములు మేమే