పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
60

[అం 2

త గి న శా స్తి

నము లేదు. ఖర్చు జీతమును మీరిపోతున్నాది. నేనుగృహస్ధుడ, నెవు గృహిణివి కవా? సంసారము సాగించే పూచీనీకు మాత్రము లేదా? ఇద్దరమూ సంసారశకటమునకు చక్రముల వంటివాళ్ళంఏనా? రెండుచక్రాలూ నడుస్తేనే కాని బండి కదులుతుందా?

 సురే--స్త్రీవిత్తము నాశిస్తున్నారా? ఇదామీపౌరుషము? తక్కువజీతము గల పని చేయడ మేమి? హెచ్చుసొమ్ము వచ్చేదే చేయకూదదా?,,, ఇన్నిమాట లెందుకు నాసొమ్ముమీ కివ్వను. సంసారము నడుపుతే నడపండి, లేకుంటే మానుకోండి, అందరమూ పస్తుందాము.
 రామ--అంతకన్న నాకు సన్యాస మిప్పిస్తే నీకు నయము. పస్తుండడము మనకు చేతనౌతుంది కాని, ఈ పిల్లలో?
 సుకే--ఒకరిప్పించడ మేమి? మీరే పుచ్చుకోండి. పెళ్లాముమీద కోపమువచ్చి ఎందరు సన్యాసులు కాలేదు. అందులో మీరొకరు.
 రామ--ఇదే కద్ద నీకు నాపై అభిమానము? చదువు చెప్పించినందుకు చక్కగా బుద్దిచెప్పినావులే. ఈపిల్లలు నీపిల్లలైతే పస్తు పడుక్కో పెట్టుతావా? పట్టుదలే ప్రధానముగా చూచుకొన్నావు కాని భర్తకి భార్యా చేదొడువాదొదుగా నుండి కుటుంబయాత్ర సాగించ వలెనని ఎరుగవా? పస్తుపేట్టుమన్నా నాపిల్లని;? సన్యాసము పుచ్చుకో మన్నావా నన్ను?