పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
58

[అం 2

త గి న శా స్తి

 రామ--ఇంటిలోకొన్నిపనులు చేయడానికి మేమూ, ఇంక కొన్ని చేయడానికి మీరూ అని భగవ ద్విలాసము, ఇద్దరమూ సృష్టిలో కావలసిన చ్వాళ్ళమే.
 సుకే--భగవంతుడు నియమించిన భేదమే కాని మీదు మరికొంత కొత్త భేదము కల్పించి మమ్ము దిగితొక్కి ఇళ్ళలోకైదుచేసి మీదు విచ్చలవిడిగా తిరుగుతూ మేమే ప్రయోజకులమని విర్రవీగుతూన్నారు. మీలాగే మాకూ స్వేచ్చ యిస్తే మీ పప్పుడుకదు.
 రామ--ఇదొక భ్రమ విచ్చలవిడిగా మేమి తిరిగి నందువల్ల మాకు వచ్చిన లాభము చెప్పనా? పదిమందితొ కలియడము, వాళ్లతొ అక్కరకుమాలిన సంబంధములు కలుగజేసుకోవడమూ, వాళ్ల దుర్గుణము లలవాటు చేసుకోవడమూ మాకబ్బుతవి. ఇంటివద్ద మీలాగే మేముంటే ఖర్చు తక్కువ, పూచీ తక్కువ, గౌరవము హెచ్చు, ఇంకోవిశేషముంది. మేము పదిచొట్ల తిరిగివచ్చినా ప్రతివిషయములోనూ మీమాట కెదురాడలేదు కదా. చిన్న తనములో చీటికి మాటికీ చిర్రూలుస్సూ అనె మగడు, అత్తగారూ, తక్కినవాళ్లున్నూ కొంతకాల మయ్యేసరికి మీకు లొంగిపోతారు. మీచేయి కిందు పురుషులచేయి మీదు అనడమే కాని అన్ని విషయములా మీమాటే నెగ్గుతుంది. మా కేమో సర్వాధికార మున్నదని సరేకాని నికరానికి చూస్తే మీకు దాసులవలెనే మెలగుతాము. మీశక్తి చాపకింద నీరులాగు