పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
52

[అం 2

త గి న శా స్తి

 సరో--నేనేమీ చెప్పలేదు. ఉత్తర మిస్తే యిచ్చి వేస్తాను.
 ఇందు--ఉత్తరమా? ఔను-నా కది తట్టలేదు. ఏమి చేయాలెనో తొచనేలెదు. నీధర్మాన చెప్పినావు, వ్రాయనా?
 సరో--నీకెలాగు తెలుస్తుంది? ముక్కుపచ్చలారని ముద్దరాలవు. లోపలికి పోయి ఉత్తరము వ్రాయి; నేనూ సిద్ధంగా నుంటాను... అయ్యె బాబో..నాపెళ్ళి కే తంటాలూపడలేదు కాని నీపెళ్ళి కూర్చడములో నా నరములు తెగుతూన్నవి. వెళ్ళు, వెళ్ళు.
 ఇందు--ఉండుండు. కొంచెము కవిత్వము చెప్పు తాను పాత్రుడా! ఆహా! ఎంత తియ్యని పేరు! ఆవేషమో! బాలకృష్ణుడే, నవనీతచోరుడే! ఏమీ తక్కువలేదు. ఆకంఠద్వని--అచ్చముగా వీణాగానమే. ముక్కు భువనమోహనము. ఓహో! పాత్రుడా!  నీ వేష మింపు, నీపేరు సొంపు, శారీరము మనోహరము, అన్నిటికన్న ముక్కు సర్వహారము, హాయిహాయి!
 సరో--ఈమె మతి పోయింది, పిచ్చెత్తినట్లున్నది... నాకూ ఇంచుమించుగా అలాగే ఉంది. ఇదే కాబోలు వలపు సొలపు. అతనికి మాత్రము మతి స్దిమితముగా నుంటుందా? అతడూ మనుష్యుడే, కనుక ఈమెరొట్టే నేతిలోపడ్డది.నావలపుకాడు జడబరతుడు,వ్యర్ధుడు, వట్టిమొద్దు, శుద్ధపశువు, అడవిమృగము, అయినా నాగ్రహచారే మేమోకాని నామన