పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
50

[అం 2

త గి న శా స్తి

?-- రెం డో రం గ ము ?--

ఇందుమతి పడకగది--ఇందుమ్నతీ సరోజినులు.

 ఇందు--సఖీ-అదిగో! అదిగో! 
 సరో--ఏమి టది?
 ఇందు--అపూర్వమోహనమే! ఆ సుందరమూర్తి! ఏమందము! మీసాలు మన్మధుని విండ్లు; ఆ చెవులు తాజా జిలాబీలు; ఆముక్కు కృష్ల్ణమూర్తిచేతి వేణు; ధ్వని మాత్రము లేదు, అదే తేడా.
 సరొ--ధ్వని లేకపోవడ మేమి? నిద్దురలో అప్పుడప్పుడు ధ్వనిచేస్తూ ఉంటుంది; అది వేణుగానమువలె చెవికింపుగా ఉండకపోవచ్చును, నాదముమాత్ర ముంది.
 ఇందు--అతని మాటలు చెవులకి తేనెతేటలు సుమా!
 సరో--పెళ్ళికొడుకు నీకు నచ్చినా డన్నమాటే
 ఇందు--నచ్చడమా! ప్రేమ ఏలాటిదో నీకు తెలియదు, నచ్చడమే కాదు, అంతకన్న ఎక్కువ సఖీ. అతనిని చూడగానే నాకాళ్ళు జారినవి, ఇప్పుడు నేను ప్రేమపదిలో మునిగిఉన్నాను.అడుగుకు చేరుతూ పైకి వస్తూ మునిగి తేల్తూన్నా నన్నమాట! నేను నాలో లేను; నిజంగా నేను లేనట్లే-లే నన్నమాట.