పుట:TELUGU-NAVALA.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

తెలుగు నవల

ధనికొండ హనుమంతరావు, చౌడేశ్వరీదేవి, రావూరి భరద్వాజ అడుగుపొరల జీవితాలను వర్ణిస్తూ నవలికలు వ్రాశారు. ఇటీవల శ్రీ రావూరి భరద్వాజ రచించిన నవల 'పాకుడురాళ్ళు' యధార్థ జీవిత వ్యథార్త దృశ్యాలను ఆవిష్కరించింది. తెరమీద మెరిసే చలనచిత్ర జీవుల సంచలనాత్మక జీవితచిత్రాలను, తెర వెనుక గాథలను, అత్యంత వాస్తవికంగా శ్రీ భరద్వాజ తమ నవలలో ప్రదర్శించారు. తెలుగులో నూటికి నూరుపాళ్ళు వాస్తవిక నవల ఇది అని చెప్పవచ్చు. సినిమాతారల జీవితరహస్యాలు, సినిమాపత్రికల, పత్రికా రచయితల జీవితోదంతాలు, భరద్వాజ ఈ నవలలో విస్తృత ప్రాతిపదికపైన వర్ణించారు. ఇటువంటి నవలలు తెలుగులో ఇదివరకేవీ లేకపోవడం దీని ప్రత్యేకత.

1960 వ సంవత్సరం వచ్చేసరికి వారపత్రికలు నవలా రచనలో పోటీలు నిర్వహించడం, పెద్ద పెద్ద బహుమతులు ప్రకటించడం, అవి రచయితలనాకర్షించడం, ఎందరో కొత్త రచయితలు ప్రేరణ పొంది, వైవిధ్యంగల ఇతివృత్తాలతో నవలలు వ్రాయడం గమనించవలసిన అంశము.

1960 నాటికే కొమ్మూరి వేణుగోపాలరావు, వీరాజీ, గొల్లపూడి మారుతీరావు, మొదలైన యువరచయితలు నవలా రచయితలుగా సుప్రసిద్ధులైనారు. కొమ్మూరి వేణుగోపాలరావుగారి నవలలు పాఠకుల్ని బాగా ఆకర్షించాయి. ఈయన వ్రాసిన 'పెంకుటిల్లు' మధ్యతరగతి కుటుంబాలలోని కలిమిలేములను, కాంక్షలను, ఆంక్షలను, సహజసుందరంగా, సముత్కంఠను పోషించే రీతిలో వర్ణించింది కాబట్టి తారుణ్యపు తొలిరోజుల పాఠకులను ఎంతగానో ఆకర్షించింది. వైద్యవృత్తిని ఇతివృత్తంగా తీసుకొని ఇటీవల శ్రీ వేణుగోపాలరావు 'హౌస్ సర్జన్' అనే మంచి నవల వ్రాశారు.

శ్రీ పురాణం సూర్యప్రకాశరావు రచించిన 'జీవనగంగ' 'మారేమనుషులు ' ఆధునిక సమాజంలోని ఆటుపోట్లను వర్ణించడంతో పాఠకులను బాగా ఆకర్షించాయి. వీరాజీ వ్రాసిన “విడీ విడనిచిక్కులు', ' ప్రేమకుపగ్గాలు' 'ఎదిగి ఎదగనిమనుషులు 'తొలిమలుపు' నవలలు యూనివర్శిటీ చదువులు ముగిస్తూ, యౌవన ప్రాంగ ణంలో అడుగు పెడుతున్న యువతీయువకుల సమస్యలను చిత్రించే నవలలు

తెలుగు నవలలను గూర్చి ప్రస్తావించేటప్పుడు కీ. శే. శారద వ్రాసిన నవలలు మంచీ చెడూ, అపస్వరాలు, తెలుగు నవలాసాహిత్య చరిత్రలోనే