పుట:TELUGU-NAVALA.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

తెలుగు నవల

రేఖ ప్రభవించరాదనేవారు మానవజగత్తులో భరించరాని ఈ ప్రజాపీడన యెందుకు వుండాలో సమాధానం చెప్పవలసి ఉంటుంది".

మంగోల్ జాతి ప్రజల నందరినీ సంఘటితం చేసిన చంఘిజ్ ఖాన్ తాను చేసిన పనిని గూర్చి ఇట్లా చెప్పుకుంటాడు. "ఆ దీనావస్థలోవున్న గోబీ ప్రజలను చూసుకుంటే నా హృదయం యెంత ఱంపపుకోతలు పడిపోయిందో మీరు ఊహించుకోలేరు. ఈ గోబీజాతులనందర్నీ ఏకైకజాతిగా సంఘటితపరచి శక్తివంతుల్ని చేయగలిగే వరకూ వీరికి విముక్తి లేదనే సత్యాన్ని నేను పసితనంలోనే అర్థం చేసుకున్నాను. ఇదే ఏకైక లక్ష్యంతో అహోరాత్రులూ, నేటివరకూ కృషి చేశాను.

'ఈ కార్యక్రమాన్ని కొనసాగించటంలో నేను అనేక ఆకార్యాలు చేశాను. ఈ లక్ష్యాన్ని సాధించటానికి అనేక కిరాతాలు చేశారు. జాతులకు జాతులనే తుడిచివేశాను..." ఏభై ఆరు ప్రకరణాలలో పన్నెండో శతాబ్దపు చరిత్రను ఉత్తమ కళాఖండంగా రూపొందించటం అసామాన్య ప్రజ్ఞాశీలికి మాత్రమేసాధ్యం, శ్రీ తెన్నేటి సూరి తెలుగు చారిత్రక నవలా రచయితల లో మహోన్నతుడు . మహోద్వేగంతో ఈ నవల నాయన వ్రాసినట్లు కనపడుతుంది. సమకాలీన ప్రపంచ చరిత్రను ఆకళింపు చేసుకొంటే ఆయనకు ఎన్నో సందేహాలు తలిగినయ్ . సంతాపాలు కలిగినయ్. చిక్కుముడులు ఎదురైనయ్. తన ప్రశ్నలకు సమాధానాల కోసం తీవ్రమైన అన్వేషణతో, తపనతో, ఆయన నిఖిల ధరాతల మానవ చరిత్రనే అధ్యయనం చేయటానికి పూనుకొన్నట్లున్నది. నలభై నాలుగో ప్రకరణంలో ప్రస్తావికంగా శ్రీ తెన్నేటి సూరి యీ వాక్యాలు వ్రాశారు.

"...పశుపక్ష్యాదులకు బుద్ధివుండదంటారు చాలామంది. ఈ వాచం ఎంత వరకు నిజమో మనకు తెలీదుగాని ఒక్కొక్కప్పుడు పశుపక్ష్యాదులు మానవుల కంటే వివేకంగా సంచరించిన ఉదాహరణలు మానవ చరిత్రలో ఎన్నో వున్నయ్ . పరస్పరం అర్థం చేసుకుని కలిసిమెలిసి బ్రతకటం బుద్ధి యొక్క ఆస్తిత్వానికి నిదర్శనమని అంగీకరించి, ఈ గుణం మానవులలోకంటే జంతువులలోనే యెక్కువగా కనిపించుతోంది. పరస్పరం అర్థంచేసుకుని కలసి, మెలసి బ్రతకటాన్ని బుద్ధికీ మానవత్వానికి ప్రధానపరీక్షగా తీసుకుంటే ఏ జంతుజాతుల్లోనూ , కూడా చేర్చటానికి వీల్లేనివ్యక్తులు మానవజాతిలో ఈనాడు నూటికి తొంభై ముగ్గురు