పుట:TELUGU-NAVALA.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిచయము

---

సహస్రాబ్దాలుగా ప్రవర్ధమానమగుచున్న తెలుగు సంస్కృతిని తెలుగు దేశపు నలుచెరగుల పరిచితము చేయు సంకల్పములో 1975 వ సంవత్సరమును తెలుగు సాంస్కృతిక సంవత్సరంగ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రకటించినది. అందుకు అనుగుణమైన కార్యక్రమాలను నిర్వహింప జేయటయే గాక , ప్రపంచములోని వివిధ దేశాలలో వసించుచున్న తెలుగువారి సాంస్కృతిక ప్రతినిధులందరును ఒక చోట సమావేశమగు వసతిని కల్పించుట కై 1975, ఏప్రిల్ 12( తెలుగు ఉగాది)మొదలుగ ప్రపంచ తెలుగు మహాసభ హైదరాబాదున జరుగునటులప్రభుత్వము నిర్ణయించినది.అందుకు ఒక ఆహ్వాన సంఘము ఏర్పాటయినది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి మాన్యశ్రీ జలగంవెంగళరావుగారు ఆ సంఘమునకు అధ్యక్షులు, విద్యాశాఖా మంత్రిమాన్య శ్రీ మండలి మెకట కృష్ణా రావు గారు దాని కార్య నిర్వాహకాధ్యక్షులు : ఆర్థిక మంత్రి మాన్య శ్రీ పిడతల రంగారెడ్డిగారు ఆర్థిక,సంస్థా కార్యక్రమాల సమన్వయ సంఘాల అధ్యక్షులు.

ఆ సంఘము, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భమున వచ్చువారికి తెలుగు జాతి సాంస్కృతిక వైభవమును తెలియజేయుటకుఅనువుగ ఆంధ్రభాషా సాహిత్య, కళా చరిత్రాదికములను గురించిఉత్తమములు, ప్రామాణికములునగు కొన్ని లఘు గ్రంథములను ప్రకటించవలెనని సంకల్పించి, ఆ కార్యనిర్వహణ కై 44 మందిసభ్యులు కల ఒక విద్వత్ సంఘమును, శ్రీ నూకల నరోత్త మ రెడ్డిగారిఅధ్యక్షతన నియమించినది. ఆ విద్వత్ సంఘము - లఘు గ్రంథముల వస్తువుల నిర్దేశించి వాని రచనకై ఆ యా రంగములందు పేరుగనిన