పుట:TELUGU-NAVALA.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

తెలుగు నవల

రావు సున్నితమైన సునిశితమైన వ్యంగ్యంతో, కథేతివృత్తాలుగా స్వీకరిస్తారు. కుటుంబరావు రచనల్లోని తిరుగుబాటు ధోరణి తర్క సహంగా, సిద్ధాంత ప్రాతిపదికంగా ఉంటుంది.

జి. వి. కృష్ణారావుగారు రచించిన నవల "కీలుబొమ్మలు " విలక్షణమైన నవల. తెలుగుదేశంలో పల్లెటూళ్ళను ప్రభావితం చేసిన రాజకీయాలు, ఆధునిక నాగరకత పల్లెటూళ్ళను కూడా ఏవిధంగా ప్రభావించేసిందో ఆ వైనం, మనిషిలోని బాహ్యాభ్యంతర ప్రవృత్తులు, వాటి సంఘర్షణలు. పాపపుణ్యాల భావనలు, ఆవి వ్యక్తి జీవితంలో ప్రసరింపజేసే ప్రభావాలూ, ప్రపంచంలో ఆదర్శాలు ప్రవచించడానికి, వాస్తవిక పరిస్థితులను ఎదుర్కొనడానికి మధ్య ఉండే అంతరం, మనిషిలో ఆహాన్ని కాపాడుకోవటానికి, పరువును పోగొట్టుకోకుండా ఉండటానికి, నిరంతరం చెల రేగే తాపత్రయమూ, ఈ నవలలో రచయిత వర్ణించారు. ఎన్నో పాత్రలు, నాటి సామాజిక పరిస్థితులకు ప్రతిబింబాలుగా ఈ నవలల్లో కనపడతాయి. జి. వి. కృష్ణారావుగారు "పాపికొండలు" పేరుతో ఒక నవలను కొంతదూరం వ్రాశారుకాని, దానిని ముగించినట్లు తోచదు. తాత్త్విక చింతన, మనోవిశ్లేషణ, సామాజికావగాహన, సమర్థవంతంగా నిర్వ హించగలిగిన నవలారచయితలలో శ్రీకృష్ణారావుగారొకరు.

శ్రీ గోపీచంద్‌ది ఒక విలక్షణమైన దృక్పథం. విలక్షణమైన శైలి. ఆయన ఆ సమర్థుని జీవయాత్ర మొదలుకొని అసంపూర్ణంగా వదిలి పెట్టిన "చీకటి గదుల" వరకూ, ఆయనలోని తాత్త్విక చింతన ఏయే అగాథమైన లోతులను సృశిస్తూ వచ్చిందో, ఏయే ఉన్నత శిఖరాల విహరిస్తూ వచ్చిందో, క్రమ పరిణామశీలంగా గమనించవచ్చు. హేతువాదదృక్పథంతో జీవితంలోకి చొచ్చుకొనివచ్చి, పూర్ణ యోగందాకా ఎదిగిన నిరంతర పరిశ్రమ, సాధన, జిజ్ఞాస గోపీచంద్ జీవితంలోని విలక్షణతలు. “ఎందుకు”. అని ప్రశ్నించటంతో ముందుకుసాగి, గవేషణతో పరిభ్రమించి “ఇందుకు!" అని సమన్వయ ప్రతివాదన చేయగల ప్రతిభాశాలిత్వం గోపీచంద్ రచనలలో కనపడుతుంది. గడియపడని తలుపులు, పరివర్తన, పిల్లతెమ్మెర వంటి నవలికలలోనైతేనేమి. ఆసమర్థుని జీవయాత్ర, మెరుపుల మరకలు,పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా, చీకటిగదుల వంటి నవలల్లో అయితేనేమి, గోపీచంద్ నిశితమైన మేథోసంపత్తి, తార్కిక ప్రజ్ఞ , పాత్రల మానసిక సంఘర్షణలలో నుంచి నిగ్గుతీసి