పుట:TELUGU-NAVALA.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగు నవల

23

సంవత్సరాల తర్వాత సంగ్రహరూపంలో 'సత్య ప్రభ' పేరుతో వెలువడింది. గణపతి ముని కుమారుడే 'వాసిష్ఠ' అనే పేరుతో, తండ్రిగారి ప్రణాళిక లో కథాభాగాన్ని అనుసరించి మార్పులు కొన్ని చేసి యథాశక్తి 'సత్య ప్రభ' నవలను ప్రచురించడం జరిగింది. ఇది చారిత్రక పౌరాణిక నవల.

కవిత్వంలో భావకవిత్వ ధోరణులనుంచి ఆధునిక కవిత్వ మార్గాలలోకి ఆడుగు పెట్టినట్లుగా నవలా రచనలో కూడా 1940 వ సంవత్సరం తరవాత ఇతివృత్తంలోనూ, శిల్పంలోనూ, నిర్వహణంలోనూ, నవీనమైన పంథాలు బయలు దేరినాయి. మనోవిశ్లేషణం, తాత్విక చింతన, రాజకీయ సిద్ధాంత విశ్లేషణం, మొదలైనవన్నీ నవలల్లో కూడా చోటుచేసుకొన్నాయి. అంటే సిద్ధాంత ప్రతిపాదనకు అనుగుణమైన పాత్రచిత్రణం చేసి సామాజిక పరిస్థితులను విశ్లేషించడం, వ్యాఖ్యానించడం రచయితలు ప్రారంభించారు.

దేశ భక్తి, జాతీయోద్యమం, పూర్వవైభవస్మరణం, స్వాతంత్ర్య ప్రబోధం, మొదలైన ఇతివృత్తాలు క్రమంగా సన్న గిలిపోయి, సామాజిక దృక్పథం, వాస్తవిక చిత్రణం ప్రాధాన్యం వహించాయి. కొడవటిగంటి కుటుంబరావు,గోపీచంద్, జి. వి. కృష్ణారావు, బుచ్చిబాబు, లు కొత్త తరహా నవలలు వ్రాశారు.

కొడవటిగంటి కుటుంబరావు సామాజిక సిద్ధాంతాలను గూర్చి స్పష్టమైన విశ్వాసాలున్న రచయిత. రాజకీయ వ్యవస్థనుగూర్చి, ఆర్థిక వ్యవస్థకూ సామా జిక దృక్పథానికీ గల పరస్పర సంబంధాన్ని గురించి అవగాహనవున్న వారు. వర్గ సంఘర్షణ, ఆర్థికమైన విలువలే సామాజికమైన తక్కిన విలువలన్నిటికీ పునాది అనే విషయమూ, ఆయన రచనల్లో ఎక్కువగా ప్రస్తావిస్తూవుంటారు. మధ్య తరగతి కుటుంబాల కృతక విలువలు, ఆత్మవంచనలు, భయాందోళనలు, ఆయన కథల్లోనూ, నవలల్లోనూ ఇతివృత్తాలు. ఆయన ఆశావాది. అతి వాస్తవిక రచయిత. కుటుంబరావుగారు చిన్న చిన్న నవలికలు చాలా రచించారు ఈయననవల 'చదువు' తెలుగులోని సామాజిక నవలల్లో పేర్కొనదగినది సుందరమనే మధ్యతరగతి కథానాయకుడు,తన జీవితంలో ఎదుర్కొన్న సన్ని వేశాలు, అనుభవించిన కష్టసుఖాలు, తటస్థించిన పాత్రలు, ఒక దృక్కోణంతో వర్ణించుకొంటూపోయినగాథ 'చదువు' నవలగా రూపొందింది. ప్రపంచ యుద్ధచ్ఛాయలు, నిరుద్యోగం, డిప్రెషన్, మధ్యతరగతి విలువలూ, కుటుంబ-