పుట:TELUGU-NAVALA.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగు నవల

13

వీరు రవీంద్రనాథ ఠాగూర్ 'గోరా' ను కూడా అనువదించారు. రాజారత్నము , గణపతి వంటి నవలలు ఈ కాలంలోనే చిలకమర్తి ప్రకటించాడు. విశ్వనాథ, వేలూరి శివరామశాస్త్రి గారు వంటివారు కూడా ఈ ఘట్టంలోనే తొలి నవలలు ప్రక టించారు.

ఈ కాలంలో నవలలను అధిక సంఖ్యాకంగా ప్రచురించిన సాహిత్య సంస్థలు, విజ్ఞానచంద్రికామండలి. ఆంధ్రప్రచారిణీ గ్రంథమాల, వేగుచుక్క గ్రంథమాలలు. విజ్ఞానచంద్రికామండలి కేవలం చారిత్రక నవలలే ప్రకటించింది. ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల చారిత్రకాలు, పౌరాణికాలు, ఆపరాధ పరిశోధక నవలలూ కూడా ప్రచురించింది. వేగుచుక్క గ్రంథమాల కేవలం అపరాధపరిశోధక నవలలే ప్రచురించింది ఈ కాలం గాంధీయుగానికి పూర్వరంగం. తిలక్ మహరాజు అఖిలభారతాన్నీ ప్రభావితం చేస్తున్న రోజులు. తదనుసారంగా జాతీయ చైతన్యాన్ని జాగృతం చేయడానికే సాహిత్యం కూడా సమాయత్తం కావడం ఈకాలపు ప్రత్యేక లక్షణం. నాటకం వ్రాసినా, నవల వ్రాసినా, కవిత వ్రాసినా, భారతీయ చరిత్రలోని, సంస్కృతిలోని ఔజ్ట్వల్యాన్ని గుర్తుకు తెచ్చి, జాతిని కర్తవ్య పరాయణోన్ముఖంగా ప్రబోధించడం కనపడుతుంది. భారతదేశ వీర చరిత్రలో, ఉదాత్త సంస్కృతిలో ఏక దేశమైన ఆంధ్రుల చరిత్ర, సంస్కృతులు కూడా, రచయితలను ఉత్తేజితులను చేశాయి. దేశభక్తి ప్రబోధం, పెల్లుబికింది. అయితే ఈ కాలంలో వెలువడ్డ చారిత్రక నవలలు, మేధావుల విమర్శకు కూడా గురి అయినాయి. గురజాడ అప్పారావు, దుగ్గిరాల రాఘవచంద్రయ్యగారి విజయనగర సామ్రాజ్యాన్ని , హేళనపూర్వకమైన విమర్శకు గురిచేశారు. నాటి చారిత్రక నవలల వర్ణనలన్నీ మూసపోసినట్లుగా ఉండటం, కల్పనలలోనూ వైవిధ్యం లేకపోవడం, చలం హేళనకు గురిఅయి, ఆయన 'తెలుగునవల' అనే వ్యంగ్యహాస్య విమర్శ వ్రాయడానికి ప్రోద్బలకాలైనాయి.

1900 నుంచి 1920 వ సంవత్సరం వరకు భారతీయ స్వాతంత్ర్యోద్యము నాయకులు బాలగంగాధర తిలకు, అరవిందుడు, లజపతిరాయ్ వంటి వారలు. ఆప్పటికి గాంధేయ ప్రభావం ఉద్యమం పైన లేదు.

ఏవిధంగా, ఏ ప్రమాణాలను బట్టి చూచినా ఇరవైయవ శతాబ్దపు మహా రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణగారు ఉన్నవవారు మాలపల్లి ప్రకటించ-