12
తెలుగు నవల
తెగనమ్మీ, అప్పులు చేసి కొడుకును ఇంగ్లండ్ పంపిస్తుంది. ఆమె భర్త జోగారావు కోర్టు మున్సబు ఉద్యోగం చేస్తుంటాడు. ఆయనకు స్వతహాగా ఇష్టం లేక పోయినా భార్య ప్రోద్బలంవల్ల, కొడుకును విదేశాలకు పంపించి చదువు చెప్పించడంవల్ల ఖర్చులు విపరీతంగా పెరిగి లంచాలు కూడా తీసుకోవడం మొదలు పెడతాడు. దాంతో ఇంటా బయటా అనేక చిక్కులు ఎదురవుతాయి . ఇంతలో మొదటి ప్రపంచయుద్ధం వస్తుంది. ఇంగ్లండులో ఉన్న ప్రసాదరావు చదుపు సాగించడానికి వీలులేక, చదువు పూర్తికాకుండానే తిరిగి రావలసి వస్తుంది. రాజేశ్వరమ్మ చాలా ఆశాభంగం చెంది, కోడలి పైన, అన్న గారి కుటుంబం పైనా కఠినత్వం వహిస్తుంది. లక్ష్మి అనేకమైన కష్టాలపాలవుతుంది. చివరకు ప్రసాదరావు తల్లి ప్రవర్తనలోని అంతర్యాన్ని తెలుసుకొని, భార్యను ఆదరిస్తాడు. సరళమైన భాష, చక్కని సన్ని వేశాలతో వెంకటశాస్త్రి గారీనవలను ఒకానొక సామాజిక ప్రయోజనాన్ని ఉద్దేశించి వ్రాశారు.
1800 నుంచి 1990వ సంవత్సరంలోపున వెలువడిన నవలలలో వెంకట శాస్త్రి గారి నవలలకు ప్రత్యేకమైన స్థానమున్నది. ఈయన సాంఘిక నవలలు, చారిత్రక నవలలు, అపరాధ పరిశోధక నవలలు కూడా వ్రాశారు. ఈ కాలంలో నవలలు బహుళ సంఖ్యలో వెలువడటమే కాకుండా, ఇతివృత్త వైవిధ్యంతో కూడా రావడం తెలుగు నవలాసాహిత్య చరిత్రలో, ఈ కాలపు విశిష్ట లక్షణంగా చెప్పాలి.
శ్రీపాదసుబ్రహ్మణ్యశాస్త్రి గారి లాంటి ప్రసిద్ధరచయితలు మిథునానురాగం, వీరపూజ, విష భుజంగం, మొదలైన నవలలు ఈ కాలంలోనే వ్రాశారు. ఆయన వ్రాసిన పెద్ద కథలన్నీ నవలికలే అని చెప్పవచ్చు.
ఇంగ్లీషు నుంచీ, బెంగాలీ నుంచీ, శివశంకరస్వామి, జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి, మొదలైన రచయితలు, ఊర్లూ పేర్లు మార్చి, అనుసరణాత్మకమైన నవలలు వెలువరించడం కూడా ఈ కాలంలోనే జరిగింది. అక్కిరాజు ఉమాకాంతం, మెడోస్ టైలర్ రచించిన టిప్పూసుల్తాన్ నవలకు అనువాదం. ప్రకటించాడు. దీనిపీఠిక లో పాశ్చాత్య దేశాలలో నవలావిర్భావక్రమపరిణామాన్ని ఆయన సమీక్షించాడు. అపరాధ పరిశోధక నవలలు, వంగ నవలల అనువాదాలతోపాటు, మాతృమందిరము, వసుమతీ వసంతం, ప్రమదావనం వంటి మౌలికమైన నవలలను కూడా వెంకటపార్వతీశ్వరకవులు ప్రకటించారు. అటుతరవాత