పుట:TELUGU-NAVALA.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

తెలుగు నవల

భార్య చనిపోతే భార్య శవంతోపాటు సజీవుడైన భర్తను పూడ్చి పెట్టటం ఆడ మలయాళంలో సదాచారం. అక్కడ స్త్రీలే ఉద్యోగాలు చేస్తారు. పురుషుడు ఇల్లు విడిచి బయట ఆడుగు పెట్టకూడదు. వ్రతాలు, నోములు, ఉద్యాపనలూ అన్నీ పురుషులకే. ఇక్కడ ఈ దేశంలో బోగంవాళ్ళు ఉన్నట్లే, అక్కడ భోగపురుషులుంటారు. ధనవంతురాండ్రు, పెద్ద పెద్ద అధికారులు అయిన స్త్రీలు, అక్కడ భోగ పురుషులను ఉంచుకొంటారు. మగవాళ్ళకు పత్నీ సేవననమే పరమధర్మమనీ, మోక్షప్రదమనీ, ఆడ మలయాళంలో పెద్దలు బోధిస్తుంటారు. గ్రంథాలు ఘోషిస్తాయి. తన కాలంలో సంఘంలో కనపడుతున్న సర్వదురాచారాలను, వ్యంగ్యంగా, హేళనపూర్వకంగా, ఆడమలయాళం దేశానికి అంటకట్టి వీరేశ లింగం వర్ణించాడు. లిల్లిపుట్ దేశయాత్ర అనే గలివర్స్ ట్రావెల్స్ ప్రథమ భాగానికి ఆడ మలయాళం అనుసరణం. బ్రాబ్డింగ్ నాగ్ యాత్ర అనే గలివర్స్ ట్రావెల్స్ రెండో భాగానికి, లంకాద్వీపమన్న భాగం అనుసరణ. లంకాద్వీపంలో ముహూర్తాలు, జాతకాలు, ప్రశ్నలు, శకునాలు, మొదలైనవన్నీ విమర్శకు గురిఅయినవి. సత్యరాజాపూర్వదేశ యాత్రల యీ రెండు భాగాలూ, అరవం, కన్నడం వంటి ఇరుగు పొరుగు భాషల్లోకి అనూదితావైనాయి. తెలుగుదేశం బాగా ఆకర్షితమైంది.

ఇవికాక చంద్రమతీ చరిత్రాన్ని కూడా వీరేశ లింగం వచన ప్రబంధంగానే పేర్కొన్నాడు కాని, ఇది వచన ప్రబంధం కాదు. చంద్రమతి బాల్యంలో, ఆమె గురువుగారైన విద్యాసముద్రుడు, ఆరోగ్యం, సత్ప్రవర్తన, దయ, ధర్మం, సత్యం, శౌచం మొదలైన విషయాలపై ఆమెకు బోధించిన విషయాలు, పదిహేను ప్రకరణాలుగా కూర్చడమే జరిగింది కాని, కథాకల్పనం ఏమీలేదు.

వీరేశలింగంతోనే తెలుగు నవల వికాసం ప్రారంభమైంది. తెలుగులో ఆప్పటిదాకా లేని ఎన్నో సాహిత్య ప్రక్రియలను తెచ్చి పెట్టి వాటికి వన్నె చిన్నెలు చేకూర్చినట్లే, ఆనంతర కాలంలో నవలగా వ్యవహృతమైన వచన ప్రబంధాన్ని వీరేశలింగమే తొలినాళ్ళలో తీర్చిదిద్దాడు.

ఇంచుమించుగా 1880 వ సంవత్సరం నుంచి 1880 వ సంవత్సరం దాకా తెలుగు దేశంలో వీరేశలింగం ఒక్కడే నవలా రచయిత ఏమోననుకోవాలి. 1881 వ సంవత్సరంలో రాజమండ్రి నుంచి 'చింతామణి' అనే సాహిత్య మాస పత్రిక వెలువడటం ప్రారంభమైంది. 1893 వ సంవత్సరంలో ఈ మాసపత్రిక