పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8 తాలాంకనందినీపరిణయము


మ.

… … …అంతరాళమున చక్కం జూచి యంచత్కృపా
మృతధారాప్తి నివృత్తదోషముగ కూర్మిన్ నిర్మలప్రాభవా
న్వితగాఁ జేతురు మత్కృతిన్ జగతి స… … … … … … …
… … … … … … … … … … … … … … … … … … … … … … .

24


చ.

హరిపదసక్తులుం, గువలయాప్తులు సత్పథవర్తు లౌచు ను
ర్వర నభివృద్ధి గాంచు ద్విజరాజు లనందగు సత్కవీశ్వరుల్
… … … … … … … … … … … … … … … … … … … … … …
సరసత కీర్తిచంద్రికల సాధుతరుల్ గురిపింపఁజేయరే!

25

కుకవి నింద

చ.

సురుచిరవృత్తనేమములుఁ జూడక హీనకథాప్రసక్తిచే
గురులఘువర్ణనిర్ణయముఁ గొంచెములేక పదార్థసంగ్రహ
స్థిరమతి సత్ప్రబంధరుచిం దేఱక , శయ్యలు విశ్రమస్థలం
బరయక హీనజారులక్రియం దగు దుష్కవులన్ గణింతురే.

26


మ.

తమకై తాము వికల్పనార్థగతశబ్దంబుల్ దగం గూర్చి, ప
ద్యములుం గొన్ని సభన్ వచించునెడ[1] విద్వద్వర్యుఁడుం బూర్వప
క్షము గావించిన నోరుమూతురు తమిం గన్నంబులోఁ దేల్చి టు
క్కుమనన్ మీటిన దొంగబం టయిన గ్రుక్కన్ మిక్కుగా నుండఁడే.

27


ఉ.

రామకవాఙ్నియుక్తి మధురస్వరపంచమసూక్తి రక్తిగా
గోమలలీలఁ బల్క విని గోకిలఁ గాకినిగా గణింతు రు
ద్దామసదర్థబోధ కవితారచనం బ్రకటింపకున్న వి
ద్యామహిమాఢ్యు గౌరవగుణాఢ్యుని మౌఢ్యునిగా దలంపరే.

28
  1. విద్వత్కౌశలుం - మూలప్రతులలో పాఠము