పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4 తాలాంకనందినీపరిణయము


గీ.

 నెల్లలోకములకు గన్నతల్లిలీల
నుల్లసిల్లెఁడు కరుణామతల్లికేక్ష
ణోల్లసితనేత్రయుగ రమావల్లభుండు
గాననయ్యెను స్వప్నసాక్షాత్కరముగ.

12


తే.

తరణికిరణప్రకరణధిక్కరణరుచిర
విస్ఫురణతనుతేజఃప్రవీణ విభవ
లోకనానేకసంభవోత్సేకభక్తి
కేల్మొగిడ్చి పునర్నమస్క్రియ లొనర్చి.

13


క.

యోగ్యంబేమో మును, మ
ద్భాగ్యమునే శ్రీరమాధిపతిఁ గనుట మహా
భాగ్యంబై జన్మం బా
రోగ్యం బయ్యెనని బొగడ రూఢిఁ దలఁచితిన్.

14

గునుగుసీసము[1]

పరమయోగిహృదయశరణములగు చర
ణములు, తారాగణాభిముఖములు, న
ఖములు, తాబెళములకరణి నేవళములై
బొదలు ప్రపదములుఁ, బొంకమైన
గమకంపు బంగరుకాహళికల హళా
హళిసేయు జంఘలు, తళుకు తిన్ని
యల వన్నియల మిన్నయగు పిఱుందులు, గజ్జ
నంటిదంటల కడగంట గెంటఁ
గల మగంటిమి జాల్తొడలనడరు, బెడంగు
పిడికిటిలోననే నడఁగెఁ గన్ను
జెదఱి బాపురే యన జెల్వగు లేఁగౌను,
[2]చౌకుచౌకం జేసి... .... ...

  1. ‘గునుక సీసము’ అని ‘తా’ ప్రతులలో గలదు.
  2. మూలప్రతులలో ఈపాద మింతే గలదు.