పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 3


ఇట్లు శ్రీమద్వృషధరాధరసౌధవిహరణుఁడగు వేంకటరమణు నుద్దేశించి రంగదపాంగసంగతకరుణాతరంగాంగణయగు మంగాంగనాంతరంగానుషంగాభంగవైభవప్రసంగంబుఁ బ్రశంసించి, శేషగరుడచమూనాథవిశేషప్రభావం బాశ్వాసించి, దివ్యాయుధపంచకాంచన్మహత్త్వసత్వంబునకు గురుత్వంబు గావించి, భగవద్గుణగణవిభవానుభవప్రభావాతిశయకృతదినచర్య మద్వంశాచార్య పరంపరానుకంపాసంపల్లాభంబున కభినివేశించి, సకలాలంకరణపదప్రకరణ గూఢశ్లేషాశ్లేష శ్లాఘనీయ పురాణరచనాప్రవీణ చమత్క్రియాధురంధర కవిపురందర వాఙ్మరందస్యంద దమందప్రధానమాధుర్యంబునకు విశ్వసించి, దుష్కరపదపుష్కల శుష్కకవితాపరిష్కారులగు దుష్కవుల నిరసించి, కలుషలతావితాన లవిత్రంబుగా పవిత్రజనస్తోత్రపాత్రంబగు నొక్క చిత్రకథాచరిత్రంబు రమాకళత్రాంకితంబుగ [1]యోచింపు మటన్న, నెటులో యని వివరింపుచు, తద్గుణానుభవపరాయణుండనై యొక పుణ్యవాసరంబున న్నిద్రాపరపశుండనై యున్న సమయంబున -

10


క.

భాసురమగు నానిశి హరి
వాసరమున శేషగిరి నివాసరమేశుం
డాసురపోషణుఁ డనవర
తాసురఘోషణుఁడు సత్కృపార్ద్రహృదయుఁడై.

11


సీ.

శ్రీధరుం డరుణజపాధరుం డఖిలధ
    రాధరుండును రుచిరాధరుండు,
సుందరుండు, ధృతోరుమందరుండు, గుణాళి
    కందరుండు నుతపురందరుండు,
పావనుం డసురా౽హితావనుం డాశ్రితో
    జ్జీవనుం డమితసంభావనుండు
తారకుండు త్రిలోకదారకుండు మహోప
    కారకుం డసురసంహారకుండు

  1. యోచించుతఱిని - అనవలెను