పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దులవలన తెలియుచున్నది. 'యాదవాకిళ్ల గాక, సూర్యాపేట, సూర్యాపేట తాలూకా నరసింహపురం, మిర్యాలగూడెం తాలూకా అనుముల, జనగాం తాలూకాలోని మల్లంపల్లి, కల్వకుర్తి పొలకాలోని కోనాపురం నేటికీ మరిం గంటివారి నివాసగ్రామాలు. ఇవియేగాక ఈ ప్రాంతం నుండి వెళ్లి ఆంధ్ర ప్రాంత ములో స్థిరపడిన కుటుంబాలు గలవు, అవి విశాఖపట్టణం జిల్లా భీముని పట్నం, కృష్ణాజిల్లా మొఖాసా కలువపూడి, ఏలూరు తాలూకా లక్ష్మీపురం, . ఇవన్నీ మరింగంటివా రుంటున్న ప్రాంతాలు గ్రామాలు.

ఇక వీరి గృహనామము మిక్కిలి విశిష్టమైనది. శ్రీమద్రామాజులవారి గృహనామము ఆసూరివారే ! వీరి యింటి పేరును ఆదియే ! మొదట వీరు ఆసూరివారు, తరువాత మరింగంటి చేరి- 'ఆసూరి మరింగంటి' యైనది. ఈ పేరు వచ్చుటకుకూడా ఒక చిత్రమైనకథ. ఈ కవుల రచనంచలన తెలియు చున్నది. ఆ విషయమీది.

(ఈవంశంలో గ్రంథాలతో తెలిసిన మొదటికవి 'శతఘంటావధాన' సింగరాచార్యులవారు. ఆయన తన కృతులలో ఒక టైన 'దశరథరాజనందన చరిత్ర' 1 యను నిరోష్ఠ్యరామాయణము కృత్యాదిలో (1-03,04) తెల్పిన విషయ మిది. తరువాత వారు కూడా ఇదే విషయాన్ని తమ గ్రంథాలలో తెల్సి నారు.)

శేషాంశ సంభవులైన లక్ష్మణాచార్యులవారు పన్నెండు వేలమంది త్రిదండ సన్న్యాసులు, ఏడువేలమంది. ఇతరజనము, డెబ్బయి నాల్గువేల గురుజనము, లక్షమంది తిరునామధారులు - వీరందరూ వెంటరాగా శ్రీవైష్ణవమతస్థాపనార్థము బయలుదేరి ఆనుకూలురను గ్రహించి-చెనటులను శిక్షించి - అష్టదిశలలోను శ్రీమతమును స్థాపించి- శ్రీరంగ క్షేత్రమునకు విచ్చేసిరట. ఆ విధముగా వచ్చిన లక్ష్మణదేశికుల వారిని చూచి - శ్రీరంగనాయక స్వామి...

1. ఈ గ్రంథమును నాపరిష్కరణ- పీఠికతో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య ఎకాడమీవారు (1978 లోను, 1973 లోను) ప్రచురించినారు .