పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీమతే రామానుజాయ నమః

పీఠిక

సీ. "శ్రీకామినీమణి నీకు మోహపుటాలు
వై కుంఠ నగరి దేవరకు ప్రోలు గాలిమేపరిదొరగారు నీపాదాలు
పైగప్పినది మంచి పైడి శాలు గిరినెత్తి వేల రక్షించె నీకొనవ్రేలు
దనుజులమీద నీదాడికోలు నిగమాంతసంతతుల్ నీనిల్వుటంగీలు
పరులకుడీలు నీపక్కిడాలు నీనిగారంపువలపు మన్నీ నిబోలు కోవిదస్తుతి నీకు తక్కోలు మేలు కరుణదాసుని దైన్యంబు కడకు ద్రోలు
కేశవస్వామి! భాస్వత్థగేశగామి. "

ఆసూరి మరింగంటి వారు

తరతరాలుగా గీర్వాణాంధ్రభాషాకవివతంసులై అనేక విధములైన తమ రచనలద్వారా సాహిత్యచరిత్రలో సుప్రతిష్ఠితులైన మఱింగంటికవుల జన్మస్థానము నల్లగొండ తాలూకాలోని కనగల్లు గ్రామము (పూర్వ మీ ప్రాంతము 'దేవరకొండ సీమ'గా వ్యవహృతము), మరింగంటికపుల కుటుంబాలు రానురాను అన్యప్రాంతాలకు వెళ్లి స్థిరపడినవి. అట్టి గ్రామాలలో మొదటిది హుజూర్ నగర్ 1 తాలూకాలోని 'యాతవాకిళ్ల', ఈ గ్రామాన్ని నాటి మహమ్మదీయ ప్రభువు ఇబ్రహీం కుతుబ్దా వీరికి అగ్రహారముగా నొసంగినట్లు గోదావధూటీ పరిణయము (ముద్రణ 1868) శల్వపిళ్ళరాయచరిత్ర.. (అముద్రితం) కృత్యా 1. నేటీ హుజూర్ నగర్ కు మొదటి పేరు ' పోచమచెర్ల' 1985లో నిజాం నవాబు ఈ పేరు పెట్టి ఫర్మానా జారీ చేసినాచు (చూ. నీలగిరిపత్రిక 4.12.1985) పై పత్రికలో ' ఫర్మానా' యథాతథంగా ముద్రించినారు. 2, దీని వ్రాత ప్రతి డా బి. రామరాజు గారివద్ద గలదు.