పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

330

తాలాంకనందినీపరిణయము

సుమగుళుచ్ఛబంధము—

సారాచారా! సౌరాధారా!
మారాకారా! పరాత్పరా!
పారావారా! గారాశూరా!
హీరాహారా! ధరాధరా!

330


మాలిని.

కుమతకులవినాశా! కోటిసూర్యప్రకాశా!
శమదమగుణకోశా! సాధుచేతోనివేశా!
దమితతతపలాశా! దానవారాత్యధీశా!
విమలిననిజదేశా! [1]వృషగిరిశ్రీరమేశా!

331


మ.

ఇది శ్రీశేషధరోపమానసుషమేభేంద్రారిహృత్సర్వబో
ధదశ్రీమత్కనగంటిగోపవిభు బద్ధ శ్రీమఱింగంటికో
విద శ్రీరాఘవవర్యసోదరసుధీవిద్వన్నృసింహార్యశం
వదతాలాంకసునందినీపరిణయాశ్వాసంబు పంచాఖ్యమై.

332

గద్య
ఇది శ్రీమచ్ఛేషధరాధర సౌధవీథీవిహరణ వేంకటరమణ
చక్షుర్విలక్షణాక్షీణకృపాకటాక్షవీక్షణాపరిలబ్ధలక్ష్యల
క్షణానవద్య విద్యావిలాస శ్రీనివాసగురు
చరణస్మరణాభ్యసనరసనావికాస నిస్తుల్య
కల్యాణసాకల్యమౌద్గల్యగోత్ర పవిత్ర
భావనాచార్యపుత్ర పర్వత్రయకైం
కర్యవిధాన వేంకటనృసింహాభి
ధానప్రణీతంబైన తాలాంక
నందినీపరిణయం బను
మహాప్రబంధంబునందు
పంచమాశ్వాసము.

333

  1. ఈ భాగమున గణభంగము. ‘విస్తృతాద్రీంద్రవాసా’ అనిన సరిపడును.