పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

తాలాంకనందినీపరిణయము


దిద్దినరీతి నొప్పు జిగిదేరెడు కావిమెఱుంగు మోవియే
ముద్దులగుమ్మలుం గనిన మోహపయోధి మునుంగకుందురే.

275


సీ.

వానిముద్దులమోవి నానఁగా మదినాస,
        కొనుచు గ్రుక్కిళ్ళూరి కొన్నినాళ్ళు
మెఱుఁగు వానియెడందయురము పొందికఁ జూచి
        గుబ్బలాము నణంచుఁ గొన్నినాళ్లు
తళుకులౌ వానిచెక్కులు గాంచి యూరకే
        కోరిక నోరూరఁ గొన్నినాళ్లు
దినదినంబును వాని తనురుచు ల్గని మది
        గొదలేని వెతనొంది కొన్నినాళ్లు


గీ.

నెదిరి చూడఁగ నేటి కీయద నొదవగ
దైవవిధిచే వియోగమే తారసిల్లె
నెటులఁ గనుగొందు యెవరి నింకేను నందు
హితు లెవరు ముందు జీవనం బెట్లు గందు.

276


వ.

అని యిత్తెఱంగునఁ జిత్తంబు చిత్తజాయత్తంబై వియోగజనితవిరహదహన
దాహంబునకు మోహంబు సాహాయ్యంబై నిట్టట్టు నెట్టుబెట్టు నిట్టూ
ర్పులం బిట్టదరి యెట్టకేలకుం బట్టులేక గొట్టుమిట్టాడుచు, నంతకంతకుం
దురంతకంతులతాంతకుంతాహతస్వాంతరంగంబున నింతిం తనరాని
చింతాసాగరం బనివారితంబై పెల్లుం బెల్లగిల వెల్లిగొన నల్లగ్రుడ్డులం
దల్లుకొని మేరన్మీరినవిచారంబుచే నళుకుబెళుకులం దుళకించి తమ్ములం
దొమ్ములాఁడు కందమ్ముల కందమ్ములగు కజ్జలమ్ముల కజ్జలమ్ములుగా
నెమ్ము లెక్కి మెఱుంగుఁ దొఱంగం జేసి లసదరుణతరతరుణసరసీరుహపరి
మాణమ్ము లగు దృక్కోణమ్ములఁ జెన్నారు కన్నీరు పూర్ణంబులై చూర్ణంబున
వెడలి కర్ణయుగాకీర్ణం బగుట, తనుతాపపుటపాకస్వర్ణకర్ణావతంసంబులం
గదయు బదునున వగలం బొగల బొగడు పొగలెగయ సుందరకరార
విందంబునం గప్పు కొప్పప్పళింపం గప్పు కపురంపుఁ బుప్పొడుల నొప్పు
గొప్పవిరిసరులం దొరల, మబ్బునుబ్బునం గెబ్బు వేణీభరంబు వీడి