పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

139


క.

అని తనలో తను కళవళ
మెనయఁగ మనసిజుని వెతలు నినుమడిగొన జ
య్యన బొరలు లేచు బెగ్గిలు
ననితరఘనతరవియోగహతమానసయై.

271


సీ.

ఊరకే తలయూచు నులికి దిగ్గునలేచు
        నిల్వుటద్దము జూచు నేలవైచు
చిలుకకూతలకుల్కు పిలువకనే బల్కు
        కనుల నశ్రువు లొల్కు గతికి నల్కు
మరువేదనల జెందు మది తహతహ బొందు
        కళవళంబందు బెగ్గిలుచు గుందు
విభవంబులకు రోయు వెడఁదకన్నులు మూయు
        దెసఁ జెడి ధృతి బాయు దిసల డాయు


గీ.

దైవమును దూఱు తగనివేదనల వారు
నెలఁతలను రువ్వు బొటవ్రేల నేలద్రవ్వు
కాంతుని దలంచుఁ దమిబయ ల్కౌఁగిలించు
మదిని యెనలేనివెతఁ బూని మంజువాణి.

272


ఉ.

ఎవ్వరి నే భజింతు నిక నెవ్వరి కీవెత విన్నవింతు నే
డివ్విధమెల్ల సాటిసతు లించుక విన్న ననాదరంబుగా
నవ్వుచు నర్మగర్భవచనంబులచే నను రెప్పనాడి తా
రవ్వల రవ్వలంబరపు టంతియెగాక హితం బొనర్తురే!

273


చ.

చనువున నిన్నినాళ్ళు విడజాలనిబ్రేమ మెలంగియున్న చ
క్కనివిభుఁ బ్రాయఁపుం దఱిని కాంక్ష మెలంగనినాడు చెల్వ! శూ
న్యనిలయమందు దీపమిడినట్లనెగాదె తలంపు వీనితో
నెనసెడి సుందరాంగి మును పెంతతపం బొనరించియుండెనో.

274


ఉ.

అద్దిర వానిచక్కఁదన మమ్మకచెల్ల తనూవిలాస మా
నిద్దఁపుజాళువాపసిఁడినిగ్గులు జిల్కు చొకాటమౌ బొమల్