పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

తాలాంకనందినీపరిణయము


నాకుఁ బోఁకలను నే నందిచ్చితే గాని
        యతఁ డొంటిగా విడె మందలేదు
సౌరభాదిసువస్తుచయములు ననువీడి
        యేకసాక్షిగ దాఁ గ్రహించలేదు
తోటిబాలురతోడ నాటపాటలనైన
        వెనువెంట నాజంట విడువలేదు


గీ.

దైవ మీనాఁటి కెడబాప దలఁచె గాదె
యొంటిగా వానిమాని నన్నుంటఁ జేసె
నివ్వటిల్లిన నామేని జవ్వనంబు
నడవిగాసిన వెన్నెల యయ్యె నహహ!

266


ఉ.

హా విధి యెట్లు సేయునొ బ్రియం బలరంగను వాని ముద్దుకె
మ్మోవిని పంటికొద్ది చవిముట్టఁగ గ్రోలుచు కౌఁగిలించి మే
లౌ వలిగబ్బిగుబ్బ లురమంటఁగ గ్రమ్మి యనంగకేళి పుం
భావము జూపలేని యెలప్రాయ మికేటికి కాయ మేటికిన్?

267


ఉ.

వాని వయార మిట్టిదని వర్ణన జేయతరంబె నిగ్గునె
మ్మేనిమెఱుంగు కుందనము మించు మధువ్రతకోటి నంచు మే
లైన కురు ల్గణించు మృదులానన మాశశి నొంచు కౌనదే
కానఁగరాదు నాకనులగట్టినటున్న వికేమి సేయుదున్.

268


ఉ.

మత్సమసద్వయస్కుఁ డభిమన్యువరుం డదిగాక రూపసం
పత్సరసీరుహాంబకుఁడు ప్రాణపదంబగు మేనబావయం
చుత్సవ మొందుచుండఁగ వియోగవశాస్పదమైన యిట్టి యా
పత్సలిలప్రవాహ మెడబాసి కడంబడు టెట్లు దైవమా!

269


గీ.

మునుపు సౌభద్రునకు నిజంబుగను న న్నొ
సంగెద నటంచు మాయత్త సంతసింప
వేడుకల మాట లొకకొన్ని యాడె గాని
ముసలిమాయయ్య మరచెనో మొదటిమాట.

270