పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

తాలాంకనందినీపరిణయము


స్థిరవరకుంభజాతములఁ జేకొని నిర్జరకోటి నోటియ
య్యరుచి హరింపనీయ జనినట్లు బరంగెను నారికేడముల్.

243


గీ.

దేవ భవదీయవిమలకీర్తికి జలించి
మోము నైల్యము జెందెనేమో? యనంగ
కుందగుచ్ఛంబులందు నిందిందిరములు
బొందియున్నవి జూడు మద్భుతము దోఁప.

244


మ.

చిరమాకందచయప్రశోభితమునై శ్రీయుక్తమై చంపక
స్ఫురితంబై లలితోత్పలావృతమునై సువ్యక్తగీతాళిసుం
దరమై యార్యవినోదమై గురుతరద్రాక్షారసామోదవృ
త్తరవోదీరితమత్తకోకిలమునై దాఁబూనె కావ్యాకృతిన్.

245


గీ.

సతత మివ్వని పున్నాగసహితమై వ
రాశిసంచార మగుచు నుత్తాలతాల
శోభితం బౌచు రాగవిస్ఫురణ దనరి
రమ్యమై యొప్పె సంగీతరస మనఁగ.

246


మ.

వనభూకన్యక పల్లవారుణిమసుస్వాంతానురక్తిం ప్రభం
జనచంచత్సుమగుచ్ఛసుస్తనము లాస్థం జూపి దా నవ్వసం
తుని యామోదమునం బెనంగుటకు చేతఃప్రీతిచే షట్పదీ
ధ్వని దంభంబున బిల్చునున్నవదె నాథా! చూడుమీ చిత్రముల్.

247


క.

చిరము రజోజృంభితమై
సరసామోదమున దా కిసలయస్ఫూర్తిన్
బొరయుచుఁ దాళోన్నతమై
బరగె వనము నాట్యమంటపస్ఫూర్తి నిలన్.

248


గీ.

వనవధూమణి బాలపవనచలత్కి
సాలకరముల నభినయసరణిఁ జూపి