పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

133


గామరకిన్నరీరమణులైన విమోహనిమగ్నులై భవ
త్ప్రేమ వహింపఁ గోర శశిరేఖ వశంవదయౌట చిత్రమే!

237


మ.

అదిగాకన్ మును సీరపాణి భవదీయశ్రీకరాకారసం
పదలన్ మెచ్చి నిజాత్మజాతను మనోవాక్కాయత న్నీ కొసం
గెదనంచు న్వచియింపలేదె! మన శ్రీకృష్ణుండు వీక్షింప నీ
మదిలో నింతటిలోన మోహఝరినిర్మగ్నుండవౌ టొప్పునే.

238


మ.

అకటా! నీ విటు లొంటిగా నిలిచి చింతాక్రాంతతం జెంద నే
టికి యుద్యానమున న్నికుంజవనవాటిం గేళిమై మానసో
త్సుకలీలం జరియింత మంచు మది నెంతోఁ బ్రీతి పుట్టించి భూ
పకుమారాగ్రణిఁ జెట్టఁ బట్టుకొని లేవందీసి తెల్విం గొనన్.

239


గీ.

మిన్న యౌచున్న పన్నీట కన్ను లొత్తి
నెఱు లణఁగగీఱి సిగవేసి నిగ్గుపసిడి
తాయెతులు జుట్టి పైరుమా ల్దనర గట్టి
వన్నెదుప్పటి మైమలవా టొనర్చి.

240


మ.

వదలంజాలని యీవిరాళిఁ గొన నెవ్వల్ జెందఁగా నేల నేఁ
డిదిగో చూడుమి నాథ! యీవనమునం దేవేళ రంజిల్లు పూఁ
బొదలందుం జివురుల్ ననల్ విరులు గ్రొంబూపల్ శలాటుల్ ఫలా
భ్యుదయాప్తిన్ శుకశారికాపికనినాదోత్సాహసౌజన్యమై.

241


చ.

చిరఘనసారభూషితము శ్రీకరవీరఘనప్రశోభితం
బురుసుమనఃప్రియంబు గణికోజ్జ్వల మాయతకాంచనంబు భా
సురవరనీలకంఠపరిశోభిత మాప్తతిలోత్తమంబునై
సురనగరీప్రతిప్రతిభ శోభిలె నవ్వనపాళిఁ జూడుమా.

242


చ.

సుర లమృతం బహర్నిశము జుఱ్ఱుటచే వెగటుం జనించి వే
సరుట కిటన్ జలాశయకుశంబులనెల్ల శలాటికామిష