పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

తాలాంకనందినీపరిణయము


మాటిమాటికిని శ్యామాసమూహము నేమ
        కరపత్రభంగముల్ బరపి బరపి
నిలుపులేకను బద్మినీకంకణగ్రహ
        ణాపాదియై తావు లరసి యరసి
ఘనగంధవిటపరాగప్రాప్తిని విజృంభ
        మాణుఁడై యాశల మలసి మలసి


తే.

విమలవరవర్ణినీకాంచనముల వెదకి
వనిమధుపవృత్తి సూనాసవముల మెసఁగి
యటవిపక్షులతో ఫలాహతి నొనర్చి
ధౌర్త్యవృత్తిని మలయగంధవహుఁ డలరె.

207


సీ.

గున్నలేఁమామిడిగుంపులఁ జిగురాకు
        గా సంపుఁగమికి 'తన్ఖా' లొసంగి
పూఁబొద ల్విరితేనె పొట్ట జీతంబుల
        నల్లమూఁకకు 'మొఖాబిళ్ల' చేసి
పరువంపుదాడింబతరువుల ఫలలాభ
        కారశూరులకు 'జాగీరు' లొసఁగి
బూవుపుప్పొడి దిన్నెతావునెల్లను సదా
        గతివేగరులకు 'ఖిల్లతు'ల జేసి


తే.

యొక్కమొగి తనఫౌజులు పిక్కటిల్లఁ
గ్రొత్తపూఁగుత్తికత్తిచే హత్తి విరహ
చిత్తవృత్తు లడంప దండెత్తి వెడలె
కంతుఁ డుద్వేలలీల వసంతవేళ.

208


వ.

అంత నబ్భూకాంతుఁడు నిజవిరహకీలికీలాజాలవాతూలాకారంబులగు
శుకపికశారికాచంచరీకమలయపవనాదుల న్విలోకించి యిట్లనియె.

209


సీ.

బంభరంబును జూడ పటుశిలీముఖ మయ్యె
        శుభగంధవహుఁ డొకసోకుఁ డయ్యెఁ