పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

తాలాంకనందినీపరిణయము


వక సరసాప్తిచే నని ధ్రువంబుగ నమ్మిన నాకు దైవ మో
పక కనుజూపుకైన నెడబాపక వాని నడంచె నయ్యయో!

196


సీ.

ప్రియురాలిమోవితేనియ బోలిన సరోజ
        మకరందములు జూడ మాయమయ్యె
పొలఁతిలేఁబాలిండ్ల బోలిన నాళీక
        కోరకద్యుతి గాంచ దూరమయ్యె
లలనామణిబాహులతలఁ బోలిన మృణా
        ళమ్ములు గన నదృశ్యమ్ములయ్యె
సతికన్గవలఁ బోలు సత్కుశేశయదళ
        స్ఫుటదీప్తి గన తటమటములయ్యె


తే.

వనితవిద్యోతమానాంగవల్లిఁ బోలు
హితసదంభోజలతికావిహీనమయ్యె
నయ్యయో యేటికో తెల్పరయ్య భవ్య
కరములార! లసత్సరోవరములార!

197


వ.

మఱియు నాసమయంబున.

198


మ.

చలిచే నభ్రపథంబునం దిరుగుచో చండాంశుఁడున్ స్రుక్కి యా
జలధిం బాడబవహ్ని క్రాగుకొని తచ్ఛైత్యంబు బోకార్పఁగా
దలఁపుంబూని యతిత్వరం జనుటచేతం గాదె దీర్ఘంబు బో
యి లఘుత్వంబును బొందె ఘస్రములు నాహేమంతకాలంబునన్.

199


చ.

చనుల జవాదిపూత లిడి సౌధతలంబుల లోపటింటిమూ
లనషకలాతు దోమతెఱలం దగుకప్పుల నొప్పు జాళువా
పనిదగు పట్టెమంచములపై జిగిసంపెఁగపూలపాన్పులన్
వనితలు సౌఖ్యసంపదల వల్లభకోటికి గూర్తు ఱిత్తఱిన్.

200


చ.

స్మరవిశిఖార్తిఁ జెందు నభిమన్యుని బాధ సహింపలేక స
త్వరత హిమాగమంబు జను సంధి వసంతుఁడు తన్ను బోలు భూ