పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

121


సీ.

కొంచెపునడకలో నెంచఁగాదగువారు
        నొకమాటపై బెట్టుకున్నవారు
మీవేళ కొలఁదిగా తావు జేరెటివారు
        విధిదప్పితే గండి వెదుకువారు
పక్షపాతంబు లెప్పటికి మాననివారు
        మొదటినుండియు రక్తముఖమువారు
తమ్ముల వంచించి తనువు బెంచెడివారు
        ఘనవిముఖత్వంబు గాంచువారు


గీ.

గనుక మీరాకలఁ బ్రయోజనమె గాక
పాలుగలవారి భేదమేర్పఱచు బుద్ధి
మీకె గావున గలదె యేలోకములను
చాలు నిక బొండు రాజహంసంబులార.

192


క.

అని నిందించుచు వారల
కనుకూలంబైన నీరజాకరముల న
జ్జనవరుఁడు కోపరూప
మ్మున గని యాక్షేపరూపమున నిట్లనియెన్.

193


మ.

అకటా! యీ వెలిపుల్గు లంగములు మీయం దుండుటం జేసి మీ
కొకభంగంబు ఘటించె నంచు మదిలో నూహింపలేనట్టి మీ
కిక గంభీరము దక్కునే ఘనరసం బెక్క న్వివేకంబు నిం
చుక లేనట్టి జడాత్ములన్ సరసులంచుం జెప్పఁగాఁ జెల్లునే.

194


మ.

దివి హంసచ్ఛవి నోర్వలేక తుహినాప్తిం గ్రమ్ము హేమంత మి
భ్బువి హంసచ్ఛవిచే విరిందనరు మిమ్ముం జూచి మీతమ్ములన్
నెవ జెందంగ నడంచి శైత్యశరముల్ నింపం దలంపూనె నీ
సువివేకంబును లేమికిన్ సరసులంచున్ మిమ్మనం బాడియే.

195


చ.

ఇక మిము దూర నేమిటికి యింతిముఖద్యుతిగాంచు భాగ్య మ
బ్బకను తదాస్యసామ్యమగు పంకజదర్శనపుణ్య మబ్బె తా