పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

తాలాంకనందినీపరిణయము


వ.

అని యిత్తెఱంగునఁ జిత్తజోన్మత్తవృత్తిం దత్తరింపుచున్న సమ
యంబున.

187


చ.

మదనునకే వడంకు నభిమన్యున కింక మదాగమంబు చె
న్నొడవిన శైత్యకంప మతియున్నతియౌఁ గద నేఁట రేపఁటన్
మదవతి గూడెనేని కుచమండలి యౌష్ణ్యము సేదదీర్చు నం
చదనుగనుంచి యేమొ జగమంతటఁ గ్రమ్మె హిమాగమం బొగిన్.

188


సీ.

శిశిరుండు జలజముల్ చెండాడ బరువెత్త
        గా జనించిన ఘర్మకణము లేమొ!
భువనజాతము నిండి పొలము దున్నక పండ
        జల్లిన శీతబీజమ్ము లేమొ!
విమలశారదలక్ష్మి వెడలఁగాద్రోయ నే
        ర్పరఁచిన శాసనాక్షరములేమొ!
తనరాకకును దిఙ్నితంబినీజనులెల్ల
        జల్లు క్రొమ్ముత్తెపుజల్లులేమొ!


తే.

గాకయున్న నహీనసంకాశ మగుచు
భూలతాతృణతరుచయంబులను తుహిన
బిందుసందోహములు బోల్చి పెంపుఁ గనె ది
గంతవిశ్రాంతమగుచు హేమంత మంత.

189


మ.

సరసులలో మునింగియు బిసంబుల గానక బైటిమెట్ట దా
మరలిరవొందు తావులను మాటికిమాటికి జూచిజూచి యే
కరణి మృణాళనాళములు గానక నాకట స్రుక్కి స్రుక్కి దు
ర్భరహృదయవ్యథన్ వనటబాటిలు నంచల గాంచి యిట్లనున్.

190


క.

తగుమాట దెల్పెదను మీ
మొగ మెఱ్ఱనజేయనేల మొదటనె మిము నె
న్నఁగ మానసానువర్తను
లగు వాక్ప్రియు లౌట దెలియునదియుం గాకన్.

191