పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

తాలాంకనందినీపరిణయము


తే.

యిటుల శిశిరోపచారంబు లింతు లిడఁగ
ధూమవిజ్యోతి సలిలవాతూల మొకటిఁ
జేర్చి నిన్నై సృజించి యాచెలియ నాకు
దెలియఁగా బంపె నేమొకో దెలుపు జలద.

163


సీ.

నీచంచలములట్ల నేచెలి విరహాగ్ని
        వడి హెచ్చెనని దెల్పవచ్చినావొ!
కనకాంగినయనాశ్రుకణములు నీవాన
        వలె నొప్పెనని దెల్ప వచ్చినావొ
పొలఁతికి నీమబ్బుపోల్కె నేతమమైన
        హెచ్చెనంచని దెల్ప వచ్చినావొ?
బోఁటిఘర్మోదకంబులు నీకరక లట్ల
        వాటించెనని దెల్ప వచ్చినావొ?


గీ.

దిశలు మెఱిసె మహావృష్టి దేరి కురిసె
నిరులు దొరసె జలాశ్మనికరము లురిసె
గాన భవదాగమం బికనైన దెలుపు
నీమనంబున దయఁ బూని ధూమయోని.

164


చ.

వినగదవయ్య నామనవి, వేగమె మత్ప్రియురాలిపాలికిం
జనఁగదవయ్య నాకు దివసం బొక యేఁడుగ దోఁచియున్నదం
చనగదవయ్య, చిన్నతనమందున నాటిన ప్రేమ మానవ
ద్దనగదవయ్య మ్రొక్కెద దయాభివిశారద నీలనీరదా!

165


క.

నీవారవములబెంప వ
నీవారము లుల్లసింప నిఖిలదిశాళిన్
నీవారవముల నింప ధు
నీవారుల నిమ్మడింప నీవే గావే.

166


శా.

చేతోజాతమనార్తిచే బొరలు నాసేమం బపేక్షింపఁగా
దే తన్వంగీతనూస్థితుల్ దెలిపి ప్రీతిం జీవనం బిచ్చి తీ