పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

తాలాంకనందినీపరిణయము


తతశైలకంధరస్థలి విహారిమయూర
        నర్తనశిక్షావినయనటకుఁడు
ధరణీసతీగ్రీష్మతాపజ్వరనిరాస
        ఘనరసౌషధవైద్యకర్మచణుఁడు
మహితబిసిగ్రాసమదమరాళపిశాచ
        మండలోచ్చాటనమంత్రవేది


గీ.

కేవలామూలశిథిలితకేతకీప్ర
హాసకారణచిత్రవైహాసికుండు
ననెడు చెల్వున దగె నిఖిలావనీజ
నౌఘహర్షాగమంబు వర్షాగమంబు.

156


చ.

అతఁడును గర్భితంబను మహాజయభేరిని మ్రోవఁజేయఁగా
నతులితనీలకంఠభటు లార్భటిల న్విరహీజనశ్రమో
గతముఖవాయువు ల్దిశలఁ గ్రమ్మినకైవడి మింట మంట ను
ద్ధతిని సమీరవారములు దార్కొని వీఁచె సమగ్రవేగమై.

157


చ.

జలదమహార్భటీశ్రవణసాధ్వసతన్ సమయాండజోదరం
బెలమి విభిన్నమై రుధిరమెంత దివి న్గరడైనయట్లు ను
జ్ఞ్వలరవిబింబ మొప్ప నతివాయుహతిం బ్రవహించి రేఖఁగాఁ
బొలిచినరీతి భాసిలె ఋభుప్రభుకార్ముక మానగస్థలిన్.

158


చ.

అమరనదీస్థలంబు సవనాలయముం దటిదగ్నిహోత్ర మ
ర్యమవరమండలంబు వృషదాజ్యసుపాత్రయు కార్మొగుళ్లును
త్తమఘనవేదికల్ సలిలధారలు యూపములున్ మయూరసం
ఘము లతిథుల్ బొసంగెను మఖంబు ఘనాఘనయజ్వి వ్రేల్వఁగన్.

159


క.

ఆసమయంబున బుష్పశ
రాసనశరవిసరవిదళితాంగుండై సం
త్రాసమతి నీరధరు ను
ద్దేశింపుచు నులికి పలికె దీనాననుఁడై.

160